మోడీ అమెరికా పర్యటన వేళ ఇండియన్ టెక్కీలకు శుభవార్త.. హెచ్ 1 బీ వీసా నిబంధనలు సులభతరం
TeluguStop.com
ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) అమెరికా పర్యటనలో వుండగానే భారతీయ టెక్కీలకు శుభవార్త చెప్పింది అగ్రరాజ్యం.
హెచ్ 1 బీ వీసా( H-1B Visa ) నిబంధనలను సులభతరం చేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది.
హెచ్ 1 బీ వీసాలపై వున్న కొద్దిమంది భారతీయులు, ఇతర విదేశీ ఉద్యోగులు .
విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అమెరికాలోనే ఆ వీసాలను పునరుద్ధరించుకోవచ్చని విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసే అవకాశాల వున్నాయి.
భారతీయులు హెచ్ 1 బీకి మహారాజ పోషకులన్న సంగతి తెలిసిందే.నిబంధనలు సరళతరం చేసే పైలెట్ ప్రోగ్రామ్ కోసం ప్రణాళిక రూపొందించాలని విదేశాంగ శాఖ భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లూమ్‌బెర్గ్ లా ద్వారా వెలుగులోకి వచ్చాయి.
కాగా, ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా( America Visa ) జారీ చేస్తుంది.
వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.
అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట. """/" /
అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం.
ఇటీవలి కాలంలో అత్యధికంగా హెచ్ 1 బీ కింద ఉద్యోగులను ఉపయోగిస్తున్న కంపెనీలలో భారతదేశానికి చెందిన ఇన్ఫోఫిస్, టీసీఎస్‌తో పాటు .
యూఎస్‌లోని అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా కంపెనీలు వున్నాయి.టెక్కీలతో పాటు అమెరికాలో నివసించేందుకు గాను భారతీయులు వీసా కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్నారు.
లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.ఏప్రిల్ చివరి నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో 10 మిలియన్లకు పైగా ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని అంచనా.
అయితే ప్రస్తుతం లే ఆఫ్ ట్రెండ్ నడుస్తున్న కారణంగా ఎంతోమంది హెచ్ 1 బీ వీసా హోల్డర్‌లు ఉద్యోగాలు కోల్పోయారు.
అయితే వీరిని 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన బయపెడుతోంది.హెచ్ 1 బీ వీసాదారులు ఉద్యోగాన్ని కోల్పోతే.
60 రోజుల లోపు కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి.లేని పక్షంలో వారు అమెరికాలో వుండటానికి అనర్హులు.
"""/" /
ఇదిలావుండగా.అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు నిర్ణీత పరిమితికి (క్యాప్) చేరుకున్నాయని ఈ ఏడాది మార్చిలో యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
ఈ విషయాన్ని దరఖాస్తుదారులకు తెలియజేసినట్లు వెల్లడించింది.నాటి ప్రకటనను అనుసరించి హెచ్1 బీ క్యాప్‌కు తగినన్ని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌లను పొందినట్లు తెలిపింది.
ఎంపిక చేసిన రిజిస్ట్రేషన్‌లు కలిగిన పిటిషనర్లు 2024 ఆర్ధిక సంవత్సరానికి హెచ్ 1 బీ క్యాప్ సబ్జెక్ట్ పిటిషన్‌లను దాఖలు చేయవచ్చని వెల్లడించింది.
బడా ప్రొడ్యూసర్ కు 1200 ల ఎకరాలు… కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్?