స్టార్‌షిప్‌లో ఏకంగా 63 మార్పులను చేయించిన అగ్రరాజ్యం!
TeluguStop.com
టెక్ దిగ్గజం స్పేస్‌ఎక్స్( SpaceX )కు అమెరికా గగనతల నిర్వహణ సంస్థ గట్టి షాకే ఇచ్చిందని చాలా స్పస్టంగా అర్ధం అవుతోంది.
స్టార్‌షిప్ గురించి జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు.ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ అయిన స్టార్‌షిప్‌లో అమెరికా గగనతల నిర్వహణ సంస్థ భారీగా మార్పులు చేయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ రాకెట్ తొలి ప్రయోగంలోని వైఫల్యాలను విశ్లేషించి మొత్తంగా 63 మార్పులను సూచించిందట.
"""/"/
ఇకపోతే, ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్ ప్రయోగం( Starship ) విఫలమై భారీ పేలుడు సంభవించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలో దీని శకలాలు, భారీ లోహపు ముక్కలు, కాంక్రీట్ దుమ్ము కొన్ని మైళ్ల దూరం వరకు వ్యాపించింది.
దీనిపై ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్) ( FAA ) దర్యాప్తు చేపట్టిన విషయం కూడా మీకు తెలిసే వుంటుంది.
ఈ దర్యాప్తు ఆధారంగా స్టార్‌షిప్ రాకెట్‌లో మార్పులు చేసి స్పేస్ ఎక్స్ భవిష్యత్తు ప్రయోగాలకు మరోసారి ఎఫ్‌ఏఏ లైసెన్స్ తీసుకోవాలని సూచించింది.
ఇక తాజాగా ఈ చర్యలపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్( Elon Musk ) (ట్విటర్)లో ఈ విధంగా స్పందించారు.
"""/"/
''స్టార్‌షిప్ ఫ్లైట్-2( Starship Flight 2 ) కోసం ఎప్‌ఏఏ సూచించిన 57 మార్పులను పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా వుంది.
మొత్తం 63 మార్పుల్లో 6 భవిష్యత్తు ప్రయోగాల కోసమని సూచించారు.వాటిని మేము విజయవంతంగా పూర్తి చేస్తాం.
మరలా రంగంలోకి దిగుతాం!'' అని వెల్లడించారు.ఏమి మార్పులు చేశారో ఆ జాబితాను కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం.
ఇకపోతే స్టార్‌షిప్ తొలి ప్రయోగం మధ్యలోనే విఫలమైంది.ఈ భారీ రాకెట్ గాల్లోకి లేచిన వెంటనే నియంత్రణ కోల్పోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో కూలిపోయింది.
స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌షిప్ శ్రేణి రాకెట్ల ప్రాజెక్టును విజయవంతం అయితే.అంగారకుడిపైకి మనుషులు, సరఫరాల పంపిణీకి దీనిని వాడాలని భావిస్తోంది.
మరి కొన్నేళ్లలో దీనిని చంద్రుడిపైకి కూడా పంపించాలని భావిస్తోంది.
ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?