సోమాలియాలో అమెరికా దాడులు.. ఐఎస్ఐఎస్ సీనియర్ లీడర్ మృతి..

సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పవచ్చు.

అగ్రరాజ్యం అమెరికా సైనికులు చేసిన దాడిలో ఐఎస్ఐఎస్ లీడర్ బిలాల్ అల్‌ సుధాని హతమయ్యాడు.

ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్స్ లో ఉన్న కాంప్లెక్సులో స్టేట్ గ్రూప్ ప్రాంతీయ నాయకుడైన బిలాల్ అల్ సుధానిని పట్టుకునేందుకు అమెరికన్లు ప్రయత్నించాయి.

ఈ క్రమం లో సోమాలియా సైన్యం జరిపిన కాల్పుల్లో సుధని తో పాటు అతని సహచరులు మరో 10 మంది హతమయ్యారని యుఎస్ సైనిక అధికారులు వెల్లడించారు.

ఈ నెల 22వ తేదీన సోమాలియా లోని గాల్కాడ్‌ టౌన్‌ సమీపం లో అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇస్లామిక్ అల్‌ షబాబ్ కు చెందిన 30 మంది తీవ్ర వాదులు చనిపోయినట్లు సమాచారం.

"""/" / అయితే అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలటరీకి యుఎస్ సాయం అందిస్తుందని వెల్లడించారు.

2022 మే నెల నుంచి దాదాపు 500 ట్రూపులను సోమాలియా లో మోహరించినట్లు సమాచారం.

అంతే కాకుండా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సోమాలియా సైనికులకు తగిన శిక్షణ అందించడంతో పాటు వారికి సపోర్ట్ గా టెర్రరిస్ట్ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తున్నారు.

"""/" / ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాల సైనికులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ప్రపంచంలోనే ప్రముఖ దేశాలలోని ప్రజలను కాపాడేందుకే ఆ దేశాల సైనికులు సరిహద్దుల్లోనూ మరియు ముఖ్య పట్టణంలో సిద్ధంగా ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే ఐక్యరాజ్యసమితి మాత్రం ప్రపంచ దేశాలకు శాంతిని బోధిస్తూ వస్తోంది.

తెలుగులో ఫ్లాప్ హీరోయిన్.. తమిళ్ లో స్టార్ హీరోయిన్.. కృతిశెట్టికి అలా కలిసొస్తోందా?