అమెరికన్ల కోసం మూడవ టీకా రెడీ.. సింగిల్ డోస్ చాలంటున్న నిపుణులు…!!

కరోనా నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీకాలు అందుబాటులోకి వచ్చాయి.అయితే అవన్నీ డబుల్ డోస్ టీకాలే.

అంటే మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో టీకా తీసుకోవాల్సి వుంటుంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.రెండో డోసు తీసుకున్న తర్వాతే కోవిడ్ నుంచి 90 శాతం రక్షణ లభిస్తుంది.

ఈ నేపథ్యంలో సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను అభివృద్ది దిశగా దిగ్గజ ఫార్మా కంపెనీలు ఫోకస్ పెట్టాయి.

అయితే అందరికంటే ముందే ఈ తరహా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చింది అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్.

ఈ సంస్థ రూపొందించిన సింగిల్ డోసు కరోనా టీకాకు అమెరికా క‌మిటీ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది.

శుక్ర‌వారం స‌మావేశ‌మైన ప్యాన‌ల్‌.జే అండ్ జే టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనేక పేద దేశాల‌కు ఇంకా వ్యాక్సిన్ అంద‌ని నేప‌థ్యంలో.ఈ అనుమ‌తి ఇస్తున్న‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

22 మందితో కూడిన ఎక్స్‌పర్ట్స్ కమిటీలో ప్రముఖ శాస్త్రవేత్తలు, వినియోగదారుల ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు వుంటాయి.

ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాల తర్వాత.అమెరికాలో మూడ‌వ అనుమ‌తి పొందిన కంపెనీగా జాన్స‌న్ అండ్ జాన్సన్ నిల‌వ‌నున్న‌ది.

"""/"/ మరోవైపు జే అండ్ జే వ్యాక్సిన్‌కు నిపుణుల కమిటీ ఆమోదముద్ర లభించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.

టీకాల ఉత్ప‌త్తిని పెంచ‌నున్న‌ట్లు ఆయన తెలిపారు.కాగా, క‌రోనా వ‌ల్ల అమెరికాలో ఇప్ప‌టికే 5,10,000 మంది మ‌ర‌ణించిన సంగతి తెలిసిందే.

సింగిల్ డోసులోనే త‌మ వ్యాక్సిన్ ప‌నిచేస్తుంద‌ని, సాధార‌ణంగా ఇంట్లో వుపయోగించే ఫ్రిడ్జ్‌లో సుదీర్ఘ‌కాలం పాటు టీకాల‌ను నిల్వ చేయ‌వ‌చ్చు అని జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీ స్పష్టం చేసింది.

వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల్లోనే వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది.తాము అభివృద్ధి చేసిన టీకా.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు జాన్సన్ & జాన్సన్ గతంలోనే ప్రకటించింది.

అత్యవసర కేసుల్లో 85 శాతం సమర్థత చూపించినట్లు కంపెనీ తెలిపింది.అలాగే సింగిల్‌ డోసు టీకా ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా 44 వేల మందిపై జరిపి, ఆ తర్వాత ఫలితాలు వెల్లడించింది.

అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ 72 శాతం సమర్థతవంతంగా పనిచేయగా, లాటిన్‌ అమెరికా దేశాల్లో 66 శాతం, దక్షిణాఫ్రికాలో 57 శాతం పనితీరును కనబరిచిందని జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది.

చిన్న కొడుకు బారన్ ట్రంప్ భవిష్యత్తు ప్రణాళికలివే : డొనాల్డ్ ట్రంప్