డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కోవిడ్ కలకలం.. పలువురికి పాజిటివ్
TeluguStop.com
మూడేళ్ల క్రితం కరోనా( Corona Virus ) మహమ్మారి ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసిన సంగతి తెలిసిందే.
కంటికి కనిపించని సూక్ష్మజీవి మనిషిని నాలుగు గోడలకే పరిమితం చేసింది.కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.
తల్లిదండ్రులను, బిడ్డలను, ఆత్మీయులను పొగొట్టుకుని ఎందరో అనాథలుగా మిగిలారు.వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వాలు తీసుకున్న కఠిన చర్యలతో కరోనా నియంత్రణలోకి వచ్చింది.
ఇప్పటికీ కొత్త వేరియెంట్ల రూపంలో ఎక్కడో చోట కోవిడ్ విజృంభిస్తూనే ఉంది.తాజాగా అమెరికా( America )లో మరోసారి కరోనా వైరస్ చర్చనీయాంశమైంది.
అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్( Kamala Harris )ను తమ అభ్యర్ధిగా అధికారికంగా ప్రకటించేందుకు జరుగుతున్న డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కరోనా హల్‌చల్ చేసింది.
నివేదికల ప్రకారం.ఈ ఈవెంట్‌కు హాజరైన పలువురు అతిథులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
ఈ పరిణామం.రాజకీయ నాయకులు, విలేకరులు వారి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసింది.
"""/" /
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.ఆగస్ట్ 19 నుంచి 22 వరకు చికాగో( Chicago )లో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ ఊహించని విధంగా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్‌గా మారింది.
దేశంలో అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ నివేదిక రావడం కలకలం రేపింది.
డీఎన్‌సీకి హాజరైన పలువురు వ్యక్తులు తమలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
"""/" /
ప్రస్తుతం మంకీపాక్స్, ఇన్‌ఫ్లూయెంజా ఆందోళనల మధ్య అమెరికాలోని 27 రాష్ట్రాల్లో కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఆగస్ట్ 16న సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా వేసింది.
నివేదికల ప్రకారం జూన్ నుంచి దేశవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాలు క్రమంగా పెరుగుతున్నాయట.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) వైద్య ఆరోగ్య అధికారులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఊ అంటావా మామ కిస్సిక్ సాంగ్స్ లో బెస్ట్ సాంగ్ ఇదే.. అసలేం జరిగిందంటే?