భారతీయులకు గుడ్ న్యూస్...ట్రంప్ కు షాక్...హెచ్-1బి పై అమెరికా కోర్టు సంచలన తీర్పు...!!

వలస వాసులు ఎంతో మంది అమెరికాలో ఉద్యోగం చేయలని అక్కడే స్థిరపడాలని కలలు గంటూ ఉంటారు.

అలాంటి వారి కలలను నేరవేర్చేది హెచ్-1బి వీసా.ఈ వీసాలను అమెరికా వలస వాసులకు లాటరీ విధానం ద్వారా మంజూరు చేసేవారు, కానీ ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో హెచ్-1బి వీసా కేటాయింపుల విషయంలో వేతనాల ఆధారంగా వీసాలు మంజూరు చేయాలని ప్రతిపాదించడంతో ఎంతో మంది వలస వాసులు, ముఖ్యంగా భారతీయ నిపుణులు ఆందోళన చెందారు.

అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలోని ఫెడరల్ కోర్టు తప్పు బడుతూ అప్పటి ప్రతిపాదనలను కొట్టేస్తూ ట్రంప్ కు షాక్ ఇచ్చింది.

లాటరీ విధానం ద్వారా కాకుండా కేవలం వేతనాల ద్వారా లాటరీలు మజూరు చేయాలంటే, తక్కువ వేతనాలు తీసుకునే వారికి అన్యాయం జరుగుతుంది.

వారికి వీసాలు అందక వారి సంఖ్య తగ్గిపోతుంది.దాంతో ఈ ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రంప్ ప్రతిపాదనలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది.

ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదనలు విన్న కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని కొట్టేస్తూ ఎప్పటిలానే లాటరీ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కోర్టు ఇచ్చిన తాజాగా తీర్పుతో భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే """/"/ అమెరికాలో ఉన్న పలు కంపెనీలలో హెచ్-1బి ఆధారంగా పనిచేసే వారిలో అత్యధికంగా భారతీయులే ఉంటారు, అక్కడి కంపెనీలు కూడా భారత్ నుంచీ వచ్చే వలస వాసులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి.

ఒక వేళ ట్రంప్ నిర్ణయం గనుకా అమలైతే భారతీయులకు తీవ్ర నష్టం వాటిల్లేదని, కానీ తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంతో మంది భారతీయులకు భారీ లబ్ది చెకూరనుందని అంటున్నారు నిపుణులు.

వలస వాసులకు మద్దతుగా నిలిచినా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు వలస వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పొతినేని డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?