పార్క్ చేసిన కారులో కూర్చున్న వ్యక్తిని కౌగిలించుకున్న US పోలీసు.. ఎందుకో తెలుసా..

పోలీసులు చాలా కఠినంగా ఉంటారని, కరుడుగట్టిన నేరస్తులను డీల్ చేసి చేసి చివరికి వారి హృదయం ఎమోషన్‌లెస్‌గా మారిపోతుందని చాలామంది భావిస్తుంటారు.

కానీ కొందరు పోలీసులు ఇది అబద్ధమని తమ మంచి చర్యలతో నిరూపిస్తూనే ఉంటారు.

తాజాగా ఇలాంటి మంచి హృదయం ఉన్న మరొక పోలీసు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

ఈ వీడియోలో కారులో విచారంగా ఉన్న ఓ వ్యక్తిని సదరు పోలీస్ అధికారి( Police Officer ) కౌగిలించుకున్నట్లు మనం చూడవచ్చు.

పోలీసు, అతని పార్ట్‌నర్ ఆ వ్యక్తితో మాట్లాడి బాధల్లో ఉన్న అతడిని కంఫర్ట్ చేశారు.

వీడియోను మాకోంబ్ కౌంటీ షెరీఫ్( Macomb County Sheriff ) ఆఫీస్ తొలుత షేర్ చేసింది.

ఇప్పుడు దానిని మళ్లీ చాలామంది నెటిజన్లు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.వీడియో "వెయ్యి అర్థవంతమైన పదాల కంటే ఒక టైట్ హగ్ శక్తివంతమైనది.

" అని కోట్‌తో ప్రారంభం కావడం మీరు చూడవచ్చు.ఇద్దరు పోలీసులైన డిప్యూటీ థోర్న్, డిప్యూటీ పారిసెక్ రోడ్డు పక్కన ఉన్న కారును( Car ) చెక్ చేయడానికి వెళ్లారని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.

ఎవరో వారికి ఫోన్ చేసి డ్రైవర్ అపస్మారక స్థితిలో ఉండవచ్చని చెప్పారు.వారు అక్కడికి చేరుకున్నప్పుడు, జో( Joe ) అనే వ్యక్తిని కలిశారు.

వారు అతని అసలు పేరును ఉపయోగించలేదు లేదా అతని గురించి వ్యక్తిగతంగా ఏమీ చెప్పలేదు.

"""/" / కారులో ఉన్న జో డిప్యూటీ థోర్న్‌తో తాను పనికి వెళుతున్నానని చెప్పాడు, కానీ చాలా విచారంగా ఉన్నందున, బ్రేక్ అవసరమై కారు ఆపేశానని తెలిపాడు.

ఒత్తిడికి గురిచేసే అనేక సమస్యలు జోకి ఉన్నాయని గుర్తించిన డిప్యూటీ థోర్న్( Deputy Thorne ) ఎలా సహాయం చేయాలో చెప్పమని అడిగాడు.

తనకు కౌగిలింత( Hug ) మాత్రమే కావాలని జో చెప్పాడు.ఒక కౌగిలింత మాత్రమేనా అని అడిగిన తర్వాత డిప్యూటీ థోర్న్ జోను కౌగిలించుకున్నాడు.

"""/" / డిప్యూటీ థోర్న్, పారిసెక్ కూడా జోతో కలిసి కొన్ని కథలు, టిప్స్, మంచి మాటలను పంచుకున్నారు.

జోను నవ్వించారు.వీడియో చివరలో, డిప్యూటీ థోర్న్ జోకి తన ఫోన్ నంబర్‌ను ఇచ్చాడు.

జో తనకు భారంగా అనిపించినప్పుడు ఎప్పుడైనా కాల్ చేయవచ్చని అతను చెప్పాడు.మళ్లీ కౌగిలించుకుని వీడ్కోలు పలికారు.

ఈ వీడియోకు ఆన్‌లైన్‌లో చాలా కామెంట్స్ వచ్చాయి.ఈ వీడియో తమ హృదయాలను తాకిందని ప్రజలు తెలిపారు.

దయతో, శ్రద్ధగా వ్యవహరించినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.https://youtu!--be/i6b4LQQl34M లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ హార్ట్ టచింగ్ వీడియోను చూడవచ్చు.

కార్యకర్తలే బలం : తప్పు అర్థమయ్యిందా రాజా ?