విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
TeluguStop.com
వీసా ప్రాసెసింగ్, ఇమ్మిగ్రేషన్ విధానాలు సహా ‘‘ బిజినెస్ అండ్ టూరిజం వీసా’’పై ఆంధ్రా తెలంగాణ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విజయవాడలో( Vijayawada ) శుక్రవారం ఇంటరాక్షన్ సెషన్ జరిగింది.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ రెబెకా డ్రామే( Rebekah Drame ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వీసా ప్రాసెసింగ్ విధానాలతో పాటు యూఎస్ కాన్సులర్ సేవల గురించి ఈ సందర్భంగా రెబెకా వివరించారు.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలను ఆమె ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
వీసాల విషయంలో దరఖాస్తుదారులు అత్యంత నిజాయితీగా ఉండాలని ఆమె సూకచించారు.వీసా ప్రాసెసింగ్( Visa Processing ) సమయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని రెబెకా వివరించారు.
డిప్యూటీ కాన్సులర్ ఇన్ఫర్మేషన్ యూనిట్ చీఫ్ .జీన్ సోకోలోవ్స్కీ , యూఎస్ కాన్సులేట్ జనరల్ సూపర్‌వైజర్ ఐశ్వర్య రావత్ కూడా ఈ అంశంపై మాట్లాడారు.
"""/" /
ఇకపోతే.గతేడాది భారత్ నుంచి అమెరికా( America ) వెళ్లినవారిలో 51 శాతం మంది తెలుగు విద్యార్ధులే( Telugu Students ) కావడం గమనార్హం.
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో( Hyderabad US Consulate ) రోజుకు సగటున 1600 వీసాలు ప్రాసెస్ చేస్తున్నట్లు రెబెకా డ్రామే మీడియాకు తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి సిబ్బందిని పెంచి రోజుకు 2500 వీసాలు ప్రాసెస్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
"""/" /
అమెరికాలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది.
2016తో పోలిస్తే 2024లో అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి సంఖ్య నాలుగు రేట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా రాష్ట్రాల్లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది.
కెంట్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ సమయంలో విద్యార్ధులకు స్వాగతం అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం అమెరికాలో తెలుగువారి ఆధిపత్యానికి నిదర్శనం.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అమెరికా కాన్సులేట్ తెలుగువారి వీసాలను త్వరితగతిన ప్రాసెస్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
సిక్కు ఎన్జీవో సంస్ధ పెద్ద మనసు .. అమెరికా వ్యాప్తంగా ఏకంగా 10 వేల మందికి భోజనం