అమెరికా వెళ్లాలనుకునేవారికి సెకండ్ ఛాన్స్ .. ముంబైలోని యూఎస్ కాన్సులేట్ కీలక ప్రకటన

అమెరికా( America ) వెళ్లాలనుకునేవారికి ముంబైలోకి యూఎస్ కాన్సులేట్ జనరల్ శుభవార్త చెప్పారు.

కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేయబడిన అన్ని కేటగిరీల వీసా అపాయింట్‌మెంట్‌లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో కొత్త అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, 221 (జీ) సమర్పణలకు అమోదం వంటివి ఉన్నాయి.

అమెరికాకు వెళ్లాలనుకునే వ్యక్తులకు వీసా ప్రాసెసింగ్ జాప్యాన్ని తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.

"""/" / ముంబైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయంలోని ఇమ్మిగ్రెంట్ వీసా యూనిట్ ప్రకారం.

కోవిడ్ సమయంలో అపాయింట్‌మెంట్‌లు రద్దు చేబడిన దరఖాస్తుదారులందరికీ రీ షెడ్యూల్ ఎలా చేసుకోవాలో సూచనలు ఇవ్వబడ్డాయని ఓ ప్రకటనలో తెలిపింది.

దరఖాస్తుల బ్యాక్‌లాగ్‌లను పరిష్కరించడం, ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలిగించే వారికి సహాయం చేయడమే దీని వెనుక ముఖ్యోద్దేశం.

దీనికి అదనంగా కాన్సులేట్ కార్యాలయం ఇప్పుడు అన్ని వీసా వర్గాలకు 221(జీ) సమర్పణలను యాక్సెప్ట్ చేస్తోంది.

ఈ ప్రక్రియ దరఖాస్తుదారులు తమ వీసా అప్లికేషన్‌ల కోసం అవసరమైన ఏవైనా అదనపు పత్రాలను సమర్పించడానికి అనుమతించడంతో పాటు వీసా ప్రాసెసింగ్‌( Visa Processing )ను సులభతరం చేస్తుంది.

"""/" / ఇమ్మిగ్రెంట్ వీసా( Immigrant Visa )లు కోరుకునేవారికి, అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి లేదా యూఎస్‌సీఐఎస్ ఆమోదించిన పిటిషన్‌తో కాబోయే యూఎస్ యజమాని ద్వారా స్పాన్సర్ చేయబడే ప్రక్రియ ఉంటుంది.

యూఎస్‌సీఐఎస్ ద్వారా పిటిషన్ ఆమోదించబడి, నేషనల్ వీసా సెంటర్ (ఎన్‌వీఎస్)తో ప్రీ ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత.

దరఖాస్తుదారులు తదుపరి సమాచారం కోసం ఎన్‌వీఎస్, కాన్సులేట్ వెబ్‌సైట్ అందించే సూచనలను అనుసరించవచ్చు.

కెంటుకీ కాన్సులర్ సెంటర్ (కేసీసీ) డైవర్సిటీ వీసా లాటరీలో ఎంపికైన వారికి వీసా ప్రాసెసింగ్‌ను కొనసాగించడానికి సూచనలు కూడా అందిస్తారు.

విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

దీంతో వీసాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ అవసరాల నిమిత్తం భారత్‌లోని అమెరికన్ మిషన్‌ల వద్ద రద్దీ పెరుగుతోంది.

న్యూఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లలో కాన్సులేట్ కార్యాలయాలు వున్నాయి.

త్వరలోనే బెంగళూరు, అహ్మదాబాద్‌లలో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.ఇదిలావుండగా.

పంజాబ్‌( Punjab )లోని ఆధ్యాత్మిక నగరం అమృత్‌సర్‌లోనూ యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెర్చ్‌లో కమలా హారిస్‌ కథనాలే .. గూగుల్‌పై డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ఆరోపణలు