ఖలిస్తాన్ మద్ధతుదారుల అరాచకం .. హిందూ ఆలయంపై భారత వ్యతిరేక నినాదాలు , ఖండించిన అమెరికా

అమెరికాలో ఖలిస్తాన్ ( Khalistan In America )మద్ధతుదారులు రెచ్చిపోయారు.కాలిఫోర్నియా( California ) రాష్ట్రంలోని నెవార్క్ నగరంలో వున్న ప్రఖ్యాత స్వామి నారాయణ్ మందిర్ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు.

ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది.నేరస్తులను పట్టుకునేందుకు నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్( Newark Police Department ) ప్రయత్నాలను స్వాగతించింది.

ఈ మేరకు ఎక్స్‌‌లో ట్వీట్ చేసింది.శ్రీ స్వామినారాయణ్ మందిర్ హిందూ ఆలయంపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు రాయడాన్ని ఖండిస్తున్నట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ అఫైర్స్ పేర్కొంది.

"""/" / మందిరానికి సమీపంలో నివసించే ఒక భక్తుడు.ఆలయం వెలుపలి గోడపై నల్ల సిరాతో హిందూ వ్యతిరేక , భారత వ్యతిరేక గ్రాఫిటీని కనుగొని వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించినట్లు ఆలయ ప్రతినిధి భార్గవ్ పటేల్ ( Bhargav Patel )తెలిపారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విద్వేష నేరంగా భావిస్తూ దర్యాప్తు ప్రారంభించి ఆలయ వర్గాలతో మాట్లాడారు.

హిందూ ఆలయంపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు తగదని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తీవ్రంగా ఖండించింది.

ఇది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని.దీనిపై వేగంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పేర్కొంది.

ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌కు వెలుపల వున్న తీవ్రవాదులు, వేర్పాటువాదులకు చోటు ఇవ్వొద్దని ఆయన కోరారు.మా కాన్సలేట్ అధికారులు అమెరికా ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారని జైశంకర్ వెల్లడించారు.

"""/" / అయితే అమెరికాలో ఖలిస్తాన్ ఉద్యమానికి ఇక్కడి సమాజం నుంచి ఎలాంటి మద్ధతు లేదని ఇండో అమెరికన్ సిక్కు నాయకుడు, సిక్స్ ఆఫ్ అమెరికా సంస్ధకు చెందిన జెస్సీ సింగ్ ( Jesse Singh )పేర్కొన్న రోజుల వ్యవధిలోనే ఈ ఘటన కలకలం రేపింది.

మాదక ద్రవ్యాలతో పాటు పంజాబ్ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

సిక్కులతో మోడీ ప్రభుత్వానికి వున్న సత్సంబంధాలు, ఈ కమ్యూనిటీ కోసం ఆయన చేసిన పనులు గత ప్రభుత్వాలతో పోలిస్తే అపూర్వమైనవని జెస్సీ సింగ్ ప్రశంసించారు.

కిరణ్ అబ్బవరం కి కథ చెప్పిన మహేష్ బాబు డైరెక్టర్…