ఓషన్ గేట్ సబ్‌మెర్సిబుల్ ప్రమాదం .. వెలుగులోకి టైటాన్ చివరి క్షణాలు
TeluguStop.com
రెండేళ్ల క్రితం అట్లాంటిక్ మహా సముద్రంలో( Atlantic Ocean ) 13 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్( Titan Submersible ) కథ విషాదాంతమైన సంగతి తెలిసిందే.
సముద్ర గర్భంలో తీవ్ర పీడనం వల్ల అది పేలిపోయి.అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచానికి దిగ్భ్రాంతిని కలగజేసింది.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు? అందులోని ఐదుగురు వ్యక్తుల శరీరాలు ఏమైనట్లు? అన్నదానిపై రకరకాల థియరీలు నేటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
ఈ యాత్రలో టైటాన్ సబ్‌మెర్సిబుల్ శకలాలు తీరాన్ని కూడా చేరాయి.ఈ సబ్‌మెర్సిబుల్‌ను అమెరికాకు చెందిన ఓషియన్ గేట్( Ocean Gate ) అనే టూరిజం కంపెనీ రూపొందించింది.
ఇందులో ముగ్గురు ప్రయాణీకులు, ఒక పైలట్, మరో నిపుణుడు కూర్చోవడానికి వీలుంటుంది.టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లేందుకు టికెట్ ధర రూ.
2.50 లక్షల డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.
2 కోట్లకు పైమాటే). """/" /
కాగా.
టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోవడానికి ముందు చివరి క్షణాలకు సంబంధించిన ఆడియో రికార్డ్( Audio Record ) ఒకటి వెలుగులోకి వచచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ దుర్ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా యూఎస్ కోస్ట్ గార్డ్( US Coast Guard ) 20 సెకన్ల క్లిప్‌ను పంచుకుంది.
ఈ రికార్డింగ్‌లో కలవరపెట్టే శబ్ధాలు వినిపిస్తున్నాయి.ఇది జూన్ 18, 2023 నాడు పేలుడు సంభవించినప్పటి శబ్ధాలుగా అధికారులు భావిస్తున్నారు.
ఏబీసీ న్యూస్ ప్రకారం.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే పరికరం ద్వారా ప్రమాదస్థలి నుంచి దాదాపు 900 మైళ్ల దూరంలో దీనిని రికార్డ్ చేశారు.
"""/" /
ఈ శబ్ధాలు వెలుగులోకి రావడంతో సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న ఐదుగురు సజీవంగానే ఉండొచ్చన్న కథనాలు వచ్చాయి.
కానీ టైటాన్ అదృశ్యమైన నాలుగు రోజుల తర్వాత అందులోని ఐదుగురు వ్యక్తులు దురదృష్టవశాత్తూ తప్పిపోయారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు వ్యక్తులను హమీష్ హార్డింగ్, పాల్ హెన్రీ నార్జియోలెట్, తండ్రీ కొడుకులు షాజాదా, సులేమాన్ దావూద్, ఓషన్ గేట్ కో ఫౌండర్ స్టాక్టన్ రష్‌గా గుర్తించారు.
మండిపడుతున్న జనం.. రైల్లో అక్రమ నీళ్ల దందా బట్టబయలు.. వీడియో వైరల్!