భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన బోస్టన్.. రెండ్రోజుల పాటు సంబరాలు

75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారతదేశం సిద్ధమైన సంగతి తెలిసిందే.ఇప్పటికే మనదేశంలో వారం ముందు నుంచే వేడుకలు జరుగుతున్నాయి.

అటు భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన అమెరికాలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరగనున్నాయి.

బోస్టన్ నగరంలో రెండు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి.32 దేశాలకు చెందిన వారు ఈ సంబరాల్లో పాల్గొననున్నారు.

వేడుకల రోజున బోస్టన్ నగర గగనతలం మీదుగా 220 అడుగుల భారత్ - అమెరికాల జాతీయ జెండాను విమానం ద్వారా ప్రదర్శించనున్నారు.

ఇకపోతే.మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బేకర్ 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశ దినోత్సవంగా ప్రకటించారు.

దీనిని ఆగస్ట్ 15న బోస్టన్‌లోని ఇండియా స్ట్రీట్‌లో , ఆగస్ట్ 14న రోడ్ ఐలాండ్‌లోని స్టేట్ హౌస్‌లో జరుపుకుంటారు.

గ్రాండ్ మార్షల్ ఆఫ్ పరేడ్‌కు భారత మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్‌కు ఆహ్వానం అందింది.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) న్యూ ఇంగ్లాండ్.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్బ్యానర్ కింద భారత 75వ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోనుంది.

రెండు రోజుల వేడుకల్లో భాగంగా బోస్టన్ గగనతలంలో 220 అడుగుల యూఎస్ ఇండియా జెండాను విమానం ద్వారా ప్రదర్శిస్తారు.

అలాగే బోస్టన్ హార్బర్‌లో జెండా ఎగురవేయడం, ఇండియా స్ట్రీట్‌లోని ఇండియా - యూఎస్ఏ ఫ్రీడమ్ గ్యాలరీ, స్టేట్ హౌస్ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లో లైట్ అప్ వేడుక నిర్వహిస్తారు.

అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారిగా.32 దేశాలకు చెందిన వారు చారిత్రాత్మక బోస్టన్ హార్బర్‌లోని ఇండియా స్ట్రీట్‌లో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.

ఇండియా డే పరేడ్‌లో కవాతు చేస్తారని ఎఫ్ఐఏ న్యూ ఇంగ్లాండ్ తెలిపింది.స్వాతంత్ర్య పోరాటంలో మరచిపోయిన నాయకులను గుర్తుచేసుకోవడానికి, స్మరించడానికి వీలుగా ఇండియా స్ట్రీట్ అంతటా ఫ్రీడమ్ గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు ఎఫ్ఐఏ తెలిపింది.

"""/"/ గత స్మృతులుగా మిగిలిపోయిన కథలను పునర్నిర్మించడం , ముందుకు తీసుకురావడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

భారతదేశం మరోసారి విశ్వగురువుగా, ఆవిష్కరణలకు, విజ్ఞానానికి కేంద్రంగా మారాలని ఎఫ్ఐఏ న్యూ ఇంగ్లాండ్ అధ్యక్షుడు అభిషేక్ సింగ్ ఆకాంక్షించారు.

మన యువతరానికి భారతీయ వారసత్వం, సంస్కృతికి సంబంధించిన అనేక అంశాల గురించి అవగాహన పెంచడం , వాటిలో పొందుపరిచిన విలువలను గ్రహించేలా చేయడం చాలా ముఖ్యమన్నారు.

వేడుకల్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రికార్డ్ చేసిన వీడియో సందేశాన్ని ప్లే చేయనున్నారు.

భారత్ - అమెరికా సంబంధాలు చాలా దూరం వచ్చాయని.ఈ రోజు మనం సహజ భాగస్వాములమని గోయల్ వ్యాఖ్యానించారు.

తమ భాగస్వామ్యం వ్యూహాత్మకమైనదని.చాలా లోతైనదని పీయూష్ గోయల్ అన్నారు.

నేపాల్ గ్రామంలోని ఆసుపత్రిని బాగు చేసిన ప్రముఖ యూట్యూబర్‌..