యూఎస్: ఆ కారణంతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటుందట.. అందరూ షాక్..?
TeluguStop.com
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఆయనను చాలా ఎక్కువ ఓట్లతో ప్రజలు గెలిపించారు.కమలా హరీస్(Kamala Harris) కూడా చాలానే కాంపిటేషన్ ఇచ్చారు.
ఆడవాళ్లు ఆమెకు బాగా మద్దతు ఇచ్చారు.ట్రంప్ ను ఎలాగైనా ఓడించాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఎంతో కీలకమైన ఈ ఎలక్షన్లలో ఓటు వేయడానికి ఒక వ్యక్తి నిరాకరించాడు.
దాంతో అతన్ని చేసుకోబోయే ఒక అమ్మాయి చాలా ఆగ్రహించింది.అంతేకాదు అతనితో తాను చేసుకున్న నిశ్చితార్ధాన్ని క్యాన్సిల్ చేయాలనే ఒక ఆలోచనకి వచ్చింది.
ఓటు కూడా వేయడానికి ఇష్టపడని ఒక బాధ్యతారహితమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా లేదా అని ఆమె ఎడిట్ యూసర్లను అడుగుతోంది.
ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.పెళ్లి చేసుకునేటప్పుడు మంచి భార్య లేదా భర్తని ఎంచుకోవడం మాత్రమే కాదు, వారి విలువలు, నమ్మకాలు, జీవన విధానాలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం.
అయితే భార్యాభర్తలలో రాజకీయాలు, సామాజిక సమస్యలు వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం.
కానీ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వంటి ప్రాథమిక హక్కులను ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపని వారిని క్షమించకూడదు.
"""/" /
26 ఏళ్ల ఒక యువతి కూడా తన కాబోయే భర్తను క్షమించలేదు.
ఆమె కాబోయే భర్త ఓటు వేయనని కరాకండిగా చెప్పేశాడట.ఈ కారణం చేత తన నిశ్చితార్థం రద్దు చేసుకోవాలా వద్దా అని ఆమె రెడిట్‌లో ప్రశ్నించింది.
తనను పెళ్లి చేసుకునే అబ్బాయి పొలిటికల్ సిస్టమ్ అనేది ఒక చెత్త అని అన్నాడట.
పొలిటిషన్లు ఎవరూ కూడా నిజాయితీపరులు కాదని ఇప్పుడు నిలుచున్న ఇద్దరు అభ్యర్థులు కూడా చెడ్డవారినని అతను ఆమెతో వాదించాడట.
ఆ యువతి ఫ్లోరిడాలో నివసిస్తోంది అక్కడి ఎలక్షన్స్‌పై అందరి దృష్టి నెలకొంటుంది.ఎందుకంటే ఇది అమెరికా అధ్యక్షుడిని(President Of America) నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
"""/" /
ఎవరిని ఎన్నుకున్నా పరిస్థితి ఒకేలా ఉంటుందని అతను ఎంత చెప్పినా ఈ యువతికి మాత్రం ఓటింగ్ చాలా ముఖ్యం.
ఎందుకంటే ఆమె నివసిస్తున్న ఫ్లోరిడా రాష్ట్రంలో ఎన్నికలు చాలా సన్నిహితంగా ఉంటాయి.ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఆ రాష్ట్రంలో చట్టాలు మారిపోతాయి.
అలాంటి చట్టాల వల్ల తన హక్కులు దెబ్బతింటాయేమో అని ఆమె భయపడుతోంది.ఈ విషయంపై ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉండటంతో, ఆ యువతి చాలా ఇబ్బంది పడుతోంది.
తన భర్త ఓటు వేయకపోతే, వారి వివాహం సాధ్యం కాదని ఆమె భావిస్తోంది.
ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలనుకుంటున్నా, అలా చెప్పడానికి ఆమెకు ఇష్టం లేదు.ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
కొంతమంది ఆ యువతి వైపు నిలబడి, తన అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మరికొందరు మాత్రం ఓటింగ్ అనేది వ్యక్తిగత విషయమని, దాని వల్ల వివాహంపై ప్రభావం పడకూడదని అన్నారు.
ఈ విధంగా ఈ విషయంపై అభిప్రాయాలు విభజించబడ్డాయి.
లాస్ ఏంజిల్స్‌లో ఆగని మంటలు.. ఒక్కసారిగా DC-10 ట్యాంకర్ ప్రత్యక్షం.. తర్వాతేమైందో చూడండి!