జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు వ్యంగ్యంగా ట్వీట్.. రిటైర్డ్ జనరల్‌పై యూఎస్ ఆర్మీ వేటు
TeluguStop.com
మిలటరీ అధికారిగా పనిచేసి బాధ్యతగా వుండాల్సింది పోయి ఒక రిటైర్డ్ అధికారి చేసిన పనికి శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ కు ఓ రిటైర్డ్ త్రీ స్టార్ జనరల్ వ్యంగ్యంగా పంపిన ట్వీట్ పై యూఎస్ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీనికి శిక్షగా ‘మెంటర్’ స్థానం నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థ కథనాన్ని ప్రసారం చేసింది.జిల్ బైడెన్ ను కించపరిచేలా వ్యవహరించినందుకు గాను సదరు అధికారిపై విచారణ జరుపుతున్నట్లు తన కథనంలో పేర్కొంది.
నిందితుడిని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గ్యారీ వోలెస్కీగా గుర్తించారు.ఇతని సస్పెన్షన్ ను ఆర్మీ కూడా ధ్రువీకరించింది.
కంబైన్డ్ ఆర్మ్స్ సెంటర్ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ థియోడర్ మార్టిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా వున్న ‘‘ రోయ్ వర్సెస్ వేడ్ ’’ అబార్షన్ హక్కులను సుప్రీంకోర్ట్ రద్దు చేయడంపై గత నెలలో జిల్ బైడెన్ ట్వీట్ చేశారు.
దీనిని హేళన చేస్తూ వోలెస్కీ ట్వీట్ చేశారు.‘‘ దాదాపు 50 సంవత్సరాలుగా .
మన శరీరాల గురించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు మనదేశంలోని మహిళలకు వుంది.
ఈ రోజు ఆ హక్కు మన నుంచి అపహరించబడింది.అన్యాయానికి గురైనప్పటికీ, తాము మౌనంగా వుండం’’ అంటూ జిల్ బైడెన్ ట్వీట్ చేశారు.
దీనికి వోలెస్కీ రిప్లయ్ ఇస్తూ.‘‘చివరికి స్త్రీ అంటే ఏమిటో మీరు తెలుసుకున్నందుకు ఆనందంగా వుందంటూ’’ ట్వీట్ చేశారు.
అయితే ఏమైందో గానీ ఆ కాసేపటికే తన ట్వీట్ ను ఆయన డిలీట్ చేశారు.
"""/"/
కాగా.ఈ ఏడాది జూన్ 25న అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
దాదాపు 50 ఏళ్లుగా దేశంలో అమల్లో వున్న అబార్షన్ హక్కును రద్దు చేసింది న్యాయస్థానం.
రాజ్యాంగం అబార్షన్ హక్కును కల్పించలేదని.అందుకే గతంలో ఇచ్చిన రో, కేసీ తీర్పును రద్దు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.
ఇకపై అబార్షన్ ను నియంత్రించేలా రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చని తెలిపింది.అయితే ఈ తీర్పును కొందరు స్వాగతిస్తుంటే.
మరికొందరు మాత్రం తప్పుబడుతున్నారు.సుప్రీం తీర్పు వచ్చిన కాసేపటికే దాదాపు 25 రాష్ట్రాలు అబార్షన్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించాయి.