అమెరికాలో రెడ్డీస్ కి అనుకూల తీర్పు..

అమెరికాలో వ్యాపారం చేస్తూ ఎంతో మంది భారతీయులు ఉన్నత స్థాయిలని అధిరోచించారు.ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం అయ్యి విశ్వవ్యాప్తంగా తన కంపీన ఔషదాలకి మాంచి డిమాండ్ తెచ్చుకుని అగ్రగామి ఫార్మా కంపెనీగా ఎదిగిన డాక్టర్ రెడ్డీస్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది తాజాగా అమెరికా కోర్టు ఇచ్చిన తీర్పుతో డాక్టర్ రెడ్డీస్ కి భవిష్యత్తులో కోట్లు తెచిపెట్టి మరింత గా కంపెనీ విలువను పెంచనుంది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అసలు విషయం ఎమింటంటే.మార్ఫిన్‌, ఆక్సికోడైన్‌, ఫెంటానిల్, బుప్రెనార్ఫైన్‌ వంటి మత్తు మందులకు బానిసలుగా మారిన వారు అమెరికాలో ఎంతో మంది ఉన్నారు అయితే ఆ వ్యసనం నుంచీ బయట పడటానికి ఉపయోగపడే సుబోగ్జోన్‌ జనరిక్‌ ఔషధాన్ని అమెరికాలో విక్రయించటానికి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కి అమెరికా కోర్టు అంగీకారం తెలిపింది.

దీనిపై అమెరికాలో అప్పీల్స్‌ కోర్టు నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుకూలమైన తీర్పు వెలువడింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ కోర్టు ప్రకటనతో ఇప్పుడు రెడ్డీస్ ఈ ఔషధాన్ని విక్రయించేందుకు చర్యలు చేపట్టిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది.

అమెరికాలో ఈ ఔషదాన్ని విడుదల చేయగలిగితే.దీనిపై ఈ ఆర్థిక సంవత్సరంలో 50-60 మిలియన్‌ డాలర్ల అమ్మకాలను నమోదు చేయగలుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

మొత్తానికి ఓ తెలుగు ఔషద కంపెనీ అమెరికాలో సంచలనం సృష్టిస్తోందని చెప్పడం లో సందేహం లేదని చెప్పాలి.

హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?