Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఆ హిట్ సాంగ్ ను ఆయనే కొరియోగ్రఫీ చేశారా?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ గా, డాన్సర్ గా, రాజకీయ నాయకుడిగా, కొరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాలలో అనుభవం ఉన్న వ్యక్తి.

ఘోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పని చేస్తే, తన చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలు అయితే తానే రాస్తుంటారు.

ఇక అలాగే కొన్ని మూవీలోని సాంగ్ పిక్చరైజేషన్ అండ్ కొరియోగ్రఫీ కూడా పవన్ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే గుడుంబా శంకర్, జానీ( Gudumba Shankar, Johnny ) వంటి సినిమాల్లో పవనే సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేశారు అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇటీవల నటించినా బ్రో సినిమాలో కూడా ఒక సాంగ్ కి చాలా వరకు స్టెప్స్ ని కంపోజ్ చేశారట.

"""/" / బ్రో మూవీలో మై డియర్ మార్కండేయ ( My Dear Markandeya )పబ్ సాంగ్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది.

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా( Urvashi Rautela ) కూడా ఈ పాటలో చిందేసింది.

గణేష్ స్వామి, భాను ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేశారు.అయితే ఈ సాంగ్ లోని ఊర్వశి వేసిన చాలా స్టెప్స్ ని పవన్ కొరియోగ్రఫీ చేశారట.

ఈ విషయాన్ని ఊర్వశి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు.

పవన్ కి సినిమా మీద చాలా అవగాహన ఉందని, డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకు ప్రతిదీ ఆయనకు తెలుసని పేర్కొన్నారు.

ఇటు సినిమాతో పాటు అటు పాలిటిక్స్ కూడా చేసే పవన్ ని మల్టీ టాలెంటెడ్ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు ఊర్వశి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. """/" / ఇకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్ విషయానికి వస్తే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉండగా వాటిని రాజకీయాల కారణంగా పూర్తిగా పక్కన పెట్టేశారు.

ప్రస్తుతం పవన్ చేతిలో OG, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహరవీరమల్లు సినిమాలు ఉన్నాయి.

వీటిలో OG మూవీ ఆల్మోస్ట్ 70 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది.హరిహరవీరమల్లు 50 శాతం షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేసుకొని, మిగిలిన బ్యాలన్స్ పూర్తి చేయడం కోసం ఎదురు చూస్తుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ అయితే కేవలం 10 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది.

మరి ఈ మూడు సినిమాలు చిత్రీకరణను పూర్తి చేసుకొని ఎప్పుడు విడుదల అవుతారో ఏమో చూడాలి మరి.