ఫాన్స్ దెబ్బకు మార్చేసిన ఊర్వశి రౌతెలా… ఏమని ట్వీట్ చేశారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) మల్టీ స్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో(Bro) .

ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా పలుచోట్ల మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా కొన్నిచోట్ల మిశ్రమ స్పందన అందుకుంది.

ఇక ఈ సినిమాలోని మై డియర్ మార్కండేయ అనే పాటలో నటి ఊర్వశీ రౌతెలా( Urvashi Rautela ) నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ సంచలనంగా మారింది.

"""/" / ఈమె ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ( Ap Cheif Minister ) పవన్ కళ్యాణ్ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది అంటూ ఈమె పవన్ కళ్యాణ్ ను ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై ఎంతో మంది ట్రోల్స్ చేశారు .కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అన్నజ్ఞానం కూడా లేకుండా ముంబై నటి ఉన్నారా అంటూ కొందరు కామెంట్లు చేయగా జగన్ ఫ్యాన్స్ మాత్రం బారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు.

ఇలా తాను చేసిన తప్పును గుర్తించిన ఊర్వశి వెంటనే తప్పును సరి చేశారు.

"""/" / ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని సంబోధించినటువంటి ఈమె అనంతరం తన తప్పును గ్రహించి వెంటనే సరి చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్న పదాన్ని తొలగించి మా సినిమా బ్రో అవతార్ లో గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకొని అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

జులై 28న ఈ సినిమా రిలీజ్ అయింది ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ఆనందించండి అంటూ ఈమె తాను చేసిన తప్పును గుర్తించి అనంతరం సరి చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

రోజా సొంత అన్నయ్యపైనే ఫిర్యాదు చేసింది.. కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్!