గంజాయి నిర్ధారణ కోసం అందుబాటులో యూరిన్ టెస్ట్ కిట్స్:డిఎస్పి శ్రీధర్ రెడ్డి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:కోదాడ డివిజన్ పరిధిలోని మండలాల్లో గంజాయి తాగుతున్న అనుమానితులకు ఇక నుంచి యూరిన్ టెస్ట్ నిర్వహిస్తామని మెడికల్ రిపోర్టులో గంజాయి తాగినట్లు నిర్ధారణ అయితే వారిపై కేసు నమోదు చేస్తామని కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఇప్పటికే టెస్టింగ్ కిట్లు స్టేషన్ కు వచ్చాయని,గంజాయికి బానిసలైన వారిని గుర్తించి డీఅడిక్షన్ సెంటర్లకు పంపిస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని,గంజాయి అక్రమ రవాణా చేసినా,తాగుతున్న వారిపై చర్యలు తప్పవని తెలిపారు.
కోదాడ డివిజన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్నా,తాగుతున్నట్లు తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆ హీరోకు భక్తురాలిని.. ఛాన్స్ వస్తే జన్మ ధన్యం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్ వైరల్!