Urfi Javed: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఉర్ఫీ జావెద్.. సర్జరీ వికటించడంతో అలా?
TeluguStop.com
ఉర్ఫీ జావెద్.( Urfi Javed ) ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె విచిత్ర వస్త్రధారణ.
బిగ్ బాస్ షో( Bigg Boss ) ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్న ఉర్ఫీ జావెద్ తన వస్త్రధారణ విషయంతో వైరల్ అవ్వడంతో భారీగా క్రేజ్ ని సంపాదించుకుంది.
అలా చిత్ర విచిత్రమైన డ్రస్సులు వేసుకోవడంలో ఆమెకు ఆమె సాటి అని చెప్పవచ్చు.
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఉర్ఫీ జావెద్.ఆమె వేసుకునే డ్రెస్సులు ప్రతిసారి కాంట్రవర్సీ అవుతుంటాయి.
అర్థనగ్నంగా కనిపించేలా ష్యాషన్ డ్రెస్సులతో వీధుల్లోకి వచ్చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొడుతుంది.ఇక ఆమె వస్త్రధారణ పై వచ్చే నెగటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ అన్ని ఇన్ని కాదు.
కొంతమంది బండ బూతులు కూడా తిడుతూ ఉంటారు.అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా మన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది ఉర్ఫీ జావెద్.
ఇది ఇలా ఉంటే తాజాగా ఉర్ఫీ జావెద్ తనకు అరోగ్య సమస్య ఉంది అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమె చేసిన పోస్టులో షేర్ చేసిన ఫోటోలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
ఒక సర్జరీ ( Surgery ) వల్ల తన ముఖం అంద విహీనంగా తయారైనట్లు ఆమె చెప్పుకొచ్చింది.
సర్జరీ వికటించడంతో తన పరిస్థితి గుర్తుపట్టరాకుండా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.కాగా ఉర్ఫీ జావెద్ తన పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో కాంపిటీషన్ కాలం నడుస్తోంది.ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని భావిస్తుంటారు.
"""/" /
నా 18 ఏళ్ల వయసులో లిప్ ఫిల్లర్ సర్జరీ( Lip Filler Surgery ) చేయించుకున్నా.
ఆ సమయంలో నా వద్ద ఎక్కువగా డబ్బులు ఉండేవి కావు.నా పెదలు సన్నగా పీలగా ఉండేవి.
దాంతో ఎలాగైనా సరే లావుగా కనబడాలనే ఉద్దేశంతో ఒక డాక్టర్ ని సంప్రదించాను.
ఆయన తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తానని అన్నారు.కానీ నేను ఒకటి అనుకుంటే అయ్యింది మరొకటి.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలా తయారు అయిపోయింది.కొంత కాలానికి వీటిని ఆపేయాల్సి వచ్చింది.
కానీ అది చాలా డేంజర్, లేనిపోని పరిణామాలకు దారి తీస్తుంది.మీరు ఆపరేషన్ చేయించుకోవద్దు అని చెప్పడం లేదు.
కానీ ఫిల్లర్స్, బొటాక్స్ వాడే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాని అంటున్నాను అని చెప్పుకొచ్చింది ఉర్ఫీ జావెద్.
"""/" /
అలాగే అందం గురించి ఆపరేషన్ చేయించుకొని అది కాస్త వికటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
అందం సంగతి దేవుడు ఎరుగు.ముఖం మొత్తం పాడైపోతుంది.
మీరు ఎవరైనా డాక్టర్( Doctor ) దగ్గరకు వెళ్లేముందు అన్నింటి గురించి తెలుసుకొని వెళ్లాలి.
ఎవరి ఉచిత సలహాలు పాటించకండి.మీ ముఖం బాగాలేదని, మీ శరీరాకృతి చక్కగా లేదని విమర్శించేవారి గురించి అస్సలు పట్టించుకోవద్దు.
దాని బదులు ఫిల్లర్స్, సర్జరీ ఎంచుకోవడమే మంచిది.కాకపోతే అలాంటివి మంచి డాక్టర్లతో మాత్రమే ట్రీట్ మెంట్ తీసుకోవాలి అని రాసుకొచ్చింది ఉర్ఫీ జావెద్.
ఏసీబీ దూకుడు .. కేటీఆర్ అరెస్ట్ తప్పదా ?