రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం.. 12 గంటలు చదువు.. ఈ సివిల్స్ ర్యాంకర్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!
TeluguStop.com
ఎన్ని కష్టాలు ఎదురైనా కష్టపడి సక్సెస్ సాధించాలని భావించే వాళ్లకు ఏదో ఒకరోజు తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది.
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో జన్మించిన ఆకునూరి నరేష్( Akunuri Naresh ) కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యారు.
ఆకునూరి నరేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో( Poor Family ) తాను జన్మించానని తన కుటుంబానికి కేవలం ఎకరం పొలం మాత్రమే ఉందని తెలిపారు.
పొలంలో రేయింబవళ్లు పని చేస్తే మాత్రమే కుటుంబం గడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.కుటుంబ పోషణ భారమైనా తల్లీదండ్రులు మమ్మల్ని ప్రయోజకులను చేయాలని అనుకున్నారని ఆకునూరి నరేష్ వెల్లడించారు.
అమ్మనాన్న తపన, ఆకలి మంటలు చూసి గొప్ప స్థాయిలో నిలవాలని అనుకుని పట్టుదలతో చదివి సివిల్స్ లో 117వ ర్యాంక్ ను( Civils 117th Rank ) సొంతం చేసుకున్నానని ఆయన అన్నారు.
"""/" /
తనది జయశంకర్ భూపలపల్లిలోని( Jayashankar Bhupalpally ) కాశింపల్లి గ్రామమని తల్లి పేరు సులోచన, తండ్రి పేరు అయిలయ్య అని ఆకునూరి నరేష్ వెల్లడించారు.
ఐఐటీ మద్రాస్ లో( IIT Madras ) బీటెక్ పూర్తి చేశానని ఆయన కామెంట్లు చేశారు.
2017 సంవత్సరంలో సాఫ్ట్ వేర్ జాబ్ లో చేరానని ఆయన పేర్కొన్నారు.ఒకవైపు జాబ్ చేస్తూనే యూపీఎస్సీ( UPSC ) కోసం వీకెండ్ ఆన్ లైన్ అకాడమీలో చేరానని ఆకునూరి నరేష్ అన్నారు.
"""/" /
2018 సంవత్సరంలో జాబ్ మానేసి సివిల్స్ పై( Civils ) పూర్తిస్థాయిలో దృష్టి పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతిరోజూ 12 గంటల పాటు చదివానని ఆయన చెప్పుకొచ్చారు.2019 సంవత్సరంలో నరేష్ 782వ ర్యాంక్ సాధించగా మళ్లీ సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి 117వ ర్యాంక్ సాధించారు.
ఆకునూరి నరేష్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచింది.రాబోయే రోజుల్లో ఆకునూరి నరేష్ కెరీర్ పరంగా భారీ విజయాలను సొంతం చేసుకొని ఎంతోమంది స్పూరిగా నిలవాలని నెటిజన్లు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
సిగరెట్‌తో దగ్గు మాయం.. 4 ఏళ్ల పిల్లాడితో పొగ తాగించి డాక్టర్ వింత చికిత్స..