సివిల్స్ ఫలితాలు విడుదల! ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న కనిషక్ కటారియా

దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌‌- 2018 పరీక్ష తుది ఫలితాలు ఈ రోజు సాయంత్రం విడుదలయ్యాయి.

దేశవ్యాప్తంగా 759 మందిని సివిల్స్ లో ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది.గతేడాది సెప్టెంబర్‌ -అక్టోబర్‌ మాసంలో సివిల్స్‌ పరీక్షలు నిర్వహించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తిచేసి శనివారం తుది ఫలితాలను ప్రకటించారు.

ఈ ఫలితాల్లో కనిషక్‌ కటారియా ప్రథమ స్థానంలో సొంతం చేసుకోగా అక్షత్‌ జైన్‌ రెండో ర్యాంకు, జునైద్‌ అహ్మద్‌కు మూడో ర్యాంకుల్లో నిలిచారు.

అలాగే తెలుగు రాష్ట్రాలకి చెందిన వరుణ్‌రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులని సొంతం చేసుకున్నారు.

అలాగే ఈ సారి కూడా సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు తమ సత్తా నిరూపించారు.