దీంతో ఉప్పెనలో విజయ్‌ పాత్రపై క్లారిటీ వచ్చినట్లేనా?

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ఉప్పెన.ఈ చిత్రంకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఈ సినిమాను గురువు గారి స్టైల్‌లో విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది.కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడినది.

ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో ఈ చిత్రం వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్న విషయం తెల్సిందే.

భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆయన్ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే విజయ్‌ నటిస్తున్న పాత్ర ఏంటీ.అసలు ఆయన లుక్‌ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకుండా ఇన్ని రోజులు దాచి ఉంచారు.

ఎట్టకేలకు ఈ సినిమాలోని విజయ్‌ సేతుపతి లుక్‌పై క్లారిటీ ఇచ్చారు.లుక్‌పై మాత్రమే కాకుండా సినిమాలో విజయ్‌ రోల్‌ ఏంటీ అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.

విజయ్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు అని ఈ పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.చాలా సింపుల్‌గా రంగస్థలం చిత్రంలో జగపతిబాబు మాదిరిగా మాంచి విలనిజం చూపించేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

లుంగీలో మనోడి లుక్‌ అదిరిందని నిజమైన విలన్‌లా గాంభీరంగా ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌కు కామెంట్స్‌ వస్తున్నాయి.

కోలీవుడ్ ఆర్టిస్ట్ అసోసియేషన్..శబాష్ ..మీరు దమ్మున్న వారు