ఓటీటీ వైపు ఉప్పెన అడుగులు..?
TeluguStop.com
మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో పూర్తి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించారు.
ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇప్పట్లో ఈ సినిమాను రిలీజ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
అయితే ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలకు అంకితం అవుతుండటం, అందులో రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో, ఉప్పెన చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.
కానీ ఈ సినిమాను ఎలాగైనా థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తేల్చేసింది.
అయితే థియేటర్స్ ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు.ఒకవేళ తెరుచుకున్న ప్రేక్షకులు థియేటర్లు ఇప్పట్లో రారు అనే వాదన గట్టిగా వినిపిస్తుండటంతో ఉప్పెన చిత్ర యూనిట్ మరోసారి ఆలోచనలో పడింది.
ఈ సినిమాను ఏకంగా రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
మరి ఓ కొత్త హీరోకు ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే, ఈ సినిమాను ఖచ్చితంగా ఓటీటీలోనే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం