7 కోట్ల క్లబ్‌లో చేరిన ఉప్పెన
TeluguStop.com
మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ అయిన పాటలు ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి.
కాగా ఇందులో ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఈ పాట లిరిక్స్‌తో పాటు ట్యూన్ కూడా చాలా వినసొంపుగా ఉండటంతో శ్రోతలు ఈ పాటను పదేపదే వింటున్నారు.
ఇక ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో ఏకంగా 7 కోట్ల వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఈ పాటకు ఇంతలా రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
కాగా ఇప్పటికే ఈ సినిమాను రిలీజ్ చేయాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.
కాగా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశాక ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇండియన్ సైంటిస్టుల సత్తా.. స్పేస్‌లో డాకింగ్ ప్రయోగం సక్సెస్.. ఎలైట్ క్లబ్‌లో భారత్!