ఉప్పెన సినిమాలోని గుడి మాయం.. అసలు ఏం జరిగిందంటే?

ఉప్పెన సినిమాలో గంగమ్మ జాతరలో కనిపించే ఒక గుడి అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.

అయితే ఆ గుడి గురించి ఆసక్తి కరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.ఈ సినిమా విడుదలైన సంవత్సర కాలంలో ఉప్పాడ సముద్రం గుడిని గుడిలో ఉన్న దేవుణ్ణి సముద్రం మింగేసింది.

ప్రస్తుతం ఆ గుడిని పరిశీలిస్తే దానికి సంబంధించిన స్తంభాలు గోడలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నట్టుగా కనిపిస్తాయి.

కనీసం పది సంవత్సరాల నుంచి ఉప్పాడ సముద్రం ముందుకు పొంగుతూ వస్తుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు.

దీంతో అక్కడ ఉన్న ఇల్లు, గుళ్ళు, రహదారులు కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి.

ఇప్పుడు ఆ గ్రామాన్ని కూడా మింగేస్తోందని అక్కడి గ్రామస్తులు భయపడుతున్నారు.ఈ విధంగా ఉప్పొంగుతున్న సముద్ర ఉప్పెన నుంచి గ్రామస్తులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది.

"""/"/ ఇప్పటివరకు ప్రభుత్వం అక్కడ కొన్ని ఏర్పాట్లు చేసినా, అవి తాత్కాలికమే కాని పర్మినెంట్ పరిష్కారం కాదని అక్కడి గ్రామస్తులు వాపోతున్నారు.

ఇక ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అడవులను పెంచాలి అని, అప్పుడే సమస్య కొంచమైనా తగ్గుతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ ఇలా ఉప్పాడ సముద్రం ఉప్పొంగిన అప్పుడల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీనికోసం ప్రభుత్వం తగిన పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.అప్పుడు ఉప్పెన సినిమాలో ఎంతో అందంగా కనిపించిన ఈ గుడి ప్రస్తుతం సముద్రంలో కొట్టుకుపోవడం ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!