ఉప్పెనకు సంబంధించి మెదటి అల రాబోతుందట

మెగా ఫ్యామిలీ నుండి పంజా వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

ఈ చిత్రానికి సుకుమార్‌ ఒక నిర్మాత అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.సుకుమార్‌ శిష్యుడు ఈ చిత్రాన్ని సుకుమార్‌ స్టైల్‌లో తెరకెక్కించాడు అంటూ సమాచారం అందుతోంది.

ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణ కాబోతుంది.

ఖచ్చితంగా ఇదో విభిన్నమైన వైవిధ్యభరిత చిత్రంగా నిలిచి వైష్ణవ్‌ తేజ్‌కు సక్సెస్‌ను అందిస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఉప్పెన చిత్రం నుండి మొదటి వేవ్‌ రాబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

అంటే సినిమాలోని మొదటి పాటను రేపు విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అవ్వడంతో పాటల కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.కనుక సినిమా స్థాయి ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు.

Betsson Reseña Y Reputación Del Sitio (EC)