ఫుల్ స్వింగ్ లో బేబమ్మ.. బుల్లెట్ సాంగ్ తో రెచ్చిపోయిన కృతి శెట్టి..
TeluguStop.com
ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే.
ఈ అమ్మడు పరిచయమైన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాలా ఆకట్టుకుంది.17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయ మయ్యి బిజీగా మారిపోయింది.
ఈ ఒక్క సినిమా హిట్ తోనే చాలా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈమె వరుస హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ ఏడాది లోనే రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు, ఇటీవలే నాగ చైతన్య, నాగార్జున కలయికలో వచ్చిన బంగార్రాజు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
ఇక ఈమె ప్రెసెంట్ కుర్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
ప్రెసెంట్ కృతి శెట్టి రామ్ పోతినేని ది వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా నుండి ఇటీవలే బుల్లెట్ సాంగ్ రిలీజ్ అయ్యి బాగా ఆకట్టుకుంది.
ఇప్పుడు ఇదే పాటకు కృతి శెట్టి స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"""/"/ ఈ సాంగ్ లో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
పసుపు టాప్ లో జీన్స్ వేసుకుని బుల్లెట్ సాంగ్ కు వేసిన స్టెప్పులు ఆకట్టు కున్నాయి.
ఇక ఈ సినిమాతో పాటు కృతి శెట్టి నితిన్ మాచర్ల నియోజక వర్గం లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇటీవలే పవన్ చేస్తున్న రీమేక్ సినిమాలో సాయి తేజ్ సరసన అవకాశం కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఇప్పుడు తమిళ్ లో కూడా స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకుని అందరికి షాక్ ఇచ్చింది.
తమిళ్ డైరెక్టర్ బాల, సూర్య కలయికలో ఒక సినిమా రాబోతుంది.ఈ సినిమాలో సూర్య కు జోడీగా కృతి శెట్టి నటిస్తుంది.
వైరల్ వీడియో: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్యాన్స్ తో సందడి చేసిన కలెక్టర్