ఆ అమ్మాయి.. సక్సెస్‌ అయితేనే బేబమ్మ ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేది!

ఉప్పెన సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కృతి శెట్టి ఆ సినిమా సూపర్ హిట్‌ అయ్యి మంచి గుర్తింపు తెచ్చి పెట్టడంతో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

బేబమ్మ పాత్రలో నటించిన కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు మరియు నాని తో నటించిన శ్యామ్ సింగరాయ్‌ సినిమాలతో కూడా సక్సెస్ దక్కించుకుంది.

ఆ రెండు సినిమాలు సక్సెస్ అవడం తో మరిన్ని ఆఫర్లు ఈ అమ్మడికి దక్కాయి.

కానీ ఈ మధ్య కాలం లో ఈ అమ్మడు నటించగా వచ్చిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

దాంతో ఈమెకు సక్సెస్ లు భవిష్యత్తులో అయినా దక్కి మళ్లీ బిజీ అవుతుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

"""/"/ ఈ సమయంలో సుధీర్ బాబు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ సినిమా హిట్ అయితేనే కృతి శెట్టి కెరియర్ కంటిన్యూ అవుతుంది.లేదంటే ఆమె కెరియర్ మధ్యలోనే ఆగిపోయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ ఆ సినిమా కనుక ఫ్లాప్‌ అయితే కృతి యొక్క ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న కృతి శెట్టి రెండు మూడు సంవత్సరాల సందడి తోనే ఆగిపోవాల్సి వస్తుంది అంటూ ఆ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

మరి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది.

ఆమె కెరియర్ కి ఎంత హెల్ప్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!