ఉప్పెన బుచ్చి బాబు వాట్ నెక్స్ట్..?

సుకుమార్ శిష్యుడిగా ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ సక్సెస్ అందుకున్నాడు బుచ్చి బాబు.

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

మాములుగా అయితే ఒక సినిమా హిట్ అవగానే ఆ డైరక్టర్ కు వరుస అవకాశాలు వస్తాయి కాని ఉప్పెన డైరక్టర్ బుచ్చి బాబు మాత్రం తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు.

ఎన్.టి.

ఆర్ తో సినిమా అని హడావిడి చేశారు కాని అదేమి లేదని తెలుస్తుంది.

ఇంతకీ బుచ్చి బాబు సెకండ్ సినిమా ఏది అన్నది తెలియాల్సి ఉంది.మళ్లీ యువ హీరోలతోనే బుచ్చి బాబు సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం బుచ్చి బాబు తన రెండవ సినిమా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

ఎన్.టి.

ఆర్ కోసం రాసుకున్న కథ మాత్రం అలానే ఉన్నా తారక్ ఎప్పుడు ఓకే అంటే బుచ్చి బాబు అప్పుడు ఆ సినిమా చేస్తాడని తెలుస్తుంది.

మరి ఉప్పెన డైరక్టర్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.

 ఉప్పెన క్రేజ్ తో తన సెకండ్ సినిమాను కూడా బుచ్చి బాబు అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్సే..: ఈటల