నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ అన్నారు.

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో 115 సిసి కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు.

సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు.

నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.

ఎన్నో దొంగతనాలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకొని కేసులు చేధించడం జరిగిందని సీపీ తెలిపారు.

ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేస్తుందని అందువల్ల సిసి కెమెరాల ప్రాధాన్యాన్ని గుర్తించాలని కోరారు.

అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కాలనీ సంఘాల సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు.

ఇది చూసాక కూడా మ్యాంగో జ్యూస్ తాగితే ఇక అంతే.. వీడియో వైరల్..