ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై ఉత్కంఠ..!!

హైదరాబాద్ లోని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈ మేరకు ఇవాళ కార్యకర్తలు మరియు అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.

అనంతరం తన రాజకీయ భవిష్యత్ పై ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఈ లిస్టులో సుభాష్ రెడ్డి చోటు దక్కలేదు.ఆయన స్థానంలో బండారి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది.

అయితే టికెట్ కేటాయించకపోయిన నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని సుభాష్ రెడ్డి యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేదా వేరే పార్టీలో చేరతారా అనే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

ఉసిరి పొడి ఉంటే చాలు.. హెయిర్ ఫాల్ కు ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు!