పైకేమో ఫ్రిడ్జ్ డోర్.. లోపల ఏముందో చూస్తే షాక్..
TeluguStop.com
కొందరి క్రియేటివిటీని చూస్తే నిజంగానే షాక్ అయిపోతుంటాం.ఎందుకంటే వారి ప్లాన్లు ఊహకు కూడా అందకుండా ఎంతో క్రియేటివిటీగా ఉంటాయి.
అలాంటి డిఫరెంట్ వార్తలు నెట్టింట ఎంతలా వైరల్ అవుతాయో మనందరికీ తెలిసిందే.సోషల్ మీడియా అంటేనే ఇలాంటి వైరల్ వీడియోలకు పెట్టింది పేరు.
ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి క్రియేటివిటీ లేదంటే వైరల్ కంటెంట్ ఉన్నా సరే దాన్ని మిగతా ప్రపంచానికి పరిచయం చేసే వేదిక సోషల్ మీడియా.
ఇప్పుడు కూడా ఇలాంటి ఓ డిఫరెంట్ క్రియేటివిటీకి సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది.
మనం సాధారణంగా ఫ్రిడ్జ్ లను ఎందుకు వాడుతాం.హా ఎందుకు అందులో ఏవైనా కూరగాయలు లేదంటే త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలు స్టోర్ చేసుకునేందుకు అని అంటారు కదా.
అయితే మీకు తెలియని ఓ వింత పని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.మనం చాలా వీడియోల్లో పైకి ఓ వస్తువులా కనిపించినా దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఎవరికీ తెలియని సీక్రెట్లు కూడా ఉంటాయి కదా.
మొన్నటికి మొన్న బెంగుళూరులో ఇలాగే లాడ్జిలో సొరంగం తవ్విన ఘటన చూశాం.కదా ఇప్పుడు కూడా పైకి చూసేందుకు ఫ్రిడ్జ్ డోర్ కనిపిస్తోంది.
"""/"/
కానీ వైరల్ వీడియోలో దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీ కండ్లను మీరే నమ్మలేకుండా ఉంది.
ఇందులో గోడ పక్కన అమర్చి ఉన్నటువంటి ఫ్రిడ్జ్ డోర్‌ను ఓపెన్ చేసి చూడగా లోపల మాత్రం ఫ్రిడ్జ్ లేదు.
ఓ వ్యక్తి తన క్రియేటివిటీతో ఇలాంటి డిఫరెంట్ ప్లాన్ చేశాడు.అంటే తన బాత్రూమ్కు ఆ ఫ్రిడ్జ్ డోర్‌ను ఫిక్స్ చేసుకున్నాడన్నమాట.
అతనికి ఇలా ఎందుకు చేయాలనిపించిందో తెలీదు గానీ ఇలాటి డిఫరెంట్ కాన్సెప్టుకు తెర లేపేశాడు.
ఇంకేముంది దీనికి సంబంధించిన వీడియో నెట్టింట షేర్ చేయగా చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. ఎమ్మెల్యే కారు స్టిక్కర్ వాడిన వ్యక్తి అరెస్ట్