ఊర‌న్నాక ద‌ళితుల ఇళ్లు కూడా ఉంటాయి.. వైరల్ అవుతున్న ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు!

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో పాపులారిటీ కలిగి ఉన్న హీరోలలో ఉపేంద్ర ఒకరు కాగా ఉపేంద్ర( Upendra ) నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా సక్సెస్ సాధించి నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి.

సినిమాల్లో వివాదాస్పద అంశాలను టచ్ చేసే ఉపేంద్ర రాజకీయాల్లో కూడా సత్తా చాటాలని గతంలో కొన్ని ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఊరన్నాక దళితుల ఇళ్లు కూడా ఉంటాయని ఉపేంద్ర అన్నారు.

ఎక్కడైనా ఎక్కడైనా కొంతమంది చెడ్డవాళ్లు ఉంటారని వాళ్లను ఇగ్నోర్ చేయాలని ఊరు అన్న తర్వాత దళితుల ఇళ్లు కూడా ఉంటాయి కదా అని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

ఒక స్టార్ హీరో హోదాలో ఉండి గతంలో ఒక రాజకీయ పార్టీ( Political Party ) పెట్టి ఆ పార్టీకి తనే రాజీనామా చేసిన ఉపేంద్ర ఈ విధంగా కామెంట్లు చేయడం వివాదాస్పదమైంది.

"""/" / దళిత వర్గాలు ఆయన తీరుపై ఫైర్ అవుతున్నారు.సినిమలలో నీతులు చెప్పే ఉపేంద్ర నిజ జీవితంలో మాత్రం ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపేంద్ర కామెంట్ల గురించి దళిత వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఉపేంద్ర ఈ విమర్శల గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

"""/" / ఉపేంద్ర ఇలాంటి కామెంట్లు చేయడం ద్వారా అతని స్థాయిని అతనే తగ్గించుకుంటున్నాడని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకనైనా ఉపేంద్ర ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఉపేంద్ర తన కామెంట్లను వెనక్కు తీసుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు వివాదాల్లో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

సెలబ్రిటీలు మాట్లాడే మాటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

షాకింగ్ వీడియో.. డ్రైవర్‌ పొరపాటుతో మొదటి అంతస్తు నుంచి కిందపడిన కారు