వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా నుంచి అప్డేట్…

సినిమా ఇండస్ట్రీ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను తీస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న ఏకైక హీరో వెంకటేష్.

( Venkatesh ) ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యం అయితే ఉంటుంది.

ఎందుకంటే ఈయన చేసే ప్రతి పాత్రలో కొత్తదనం అయితే చూపిస్తూ ఉంటాడు.అలాగే సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ పంపించడంలో వెంకటేష్ ను మించిన వారు మరొకరు లేరు.

మరిలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాయి.

ఇక సంక్రాంతి కానుకగా శైలేష్ కోలన్ డైరెక్షన్ లో వచ్చిన సైంధవ్ సినిమా( Saindhav Movie ) పెద్దగా ఆకట్టుకోనప్పటికీ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.

"""/" / అయితే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది.

అది ఏంటి అంటే ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అనిల్ రావిపూడి( Anil Ravipudi ) వెంకటేష్ కాంబినేషన్ లో ఇంతకు ముందే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చాయి.

ఈ రెండు సినిమాలు కూడా కామెడీ పరంగా ప్రేక్షకుల్ని విపరీతంగా మెప్పించాయి.కాబట్టి ఈ సినిమా కూడా కామెడీ గానే ఉంటుందని ఇక డబల్ యాక్షన్ చేస్తున్నాడు కాబట్టి """/" / ఈ సినిమాలో మరింత కామెడీ డోస్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటూ సినిమా యూనిట్ నుంచి అప్డేట్ అయితే అందుతుంది.

చూడాలి మరి ఈ సినిమాతో వెంకటేష్ మరో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.

ఇక ఈ సినిమాతో కనుక మంచి విజయాన్ని అందుకుంటే తనకు ఇండస్ట్రీలో తిరుగు లేదనే చెప్పాలి.

ఇక ఇప్పటికే సీనియర్ హీరోలందరూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి వెంకటేష్ కూడా అదే రీతిలో ముందుకు వెళ్తాడా లేదా అని విషయాలు తెలియాల్సి ఉంది.

రజనీకాంత్ మందు తాగటానికి పిలిచి ఆయనొక్కడే తాగుతారు : సుమన్