ఈ వారం థియేటర్ ఓటీటీ సినిమాలు ఇవే.. ఆ సినిమాపైనే అంచనాలు ఉన్నాయా?

ఈ వారం లాగే ఈ వారం కూడా థియేటర్ అలాగే ఓటీటీలో విడుదల కావడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి.

మరి ఈ వారం ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి అన్న విషయానికి వస్తే.

వైవిధ్య కథలు, పాత్రలతో అలరిస్తుంటారు హీరో శ్రీ విష్ణు.దర్శకుడు హసిత్‌ గోలి, విష్ణు కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం శ్వాగ్‌.

( Swag Movie ) ఇప్పటికే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ వచ్చిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న శ్వాగ్ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ కీలక పాత్రలు పోషించారు.మరో సినిమా విషయానికి వస్తే.

రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా చిట్టి పొట్టి.

( Chitti Potti Movie ) భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు.

సిస్టర్ సెంటిమెంట్‌ తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు.అక్టోబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలోనే సైకో కిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సాయి ధన్సికా.

తుల‌సిరామ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన సినిమా దక్షిణ.( Dakshina Movie ) అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

"""/" / సీరియ‌ల్ మ‌ర్డ‌ర్స్ వెనుక‌న్న సీక్రెట్‌ ను రివీల్ చేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా నెగెటివ్ షేడ్స్‌ తో కూడిన లుక్‌లో సాయిధ‌న్సిక ఇందులో నటించింది.

అదేవిధంగా ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో శివ సాషు రూపొందించిన చిత్రం కలి.

( Kali ) కథా రచయిత కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో లీలా గౌతమ్‌ వర్మ నిర్మించారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఒక యువకుడి జీవితంలోకి అపరిచిత వ్యక్తి రావడం వల్ల అనూహ్య సంఘటనలు ఎదురవుతాయి.

మరి ఆ యువకుడు వాటిని ఎలా అధిగమించాడన్నది చిత్ర కథ.అదేవిదంగా నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బహిర్భూమి.

( Bahirbhoomi ) """/" / ఈ మూవీని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణు మాధవ్ నిర్మిస్తున్నారు.

రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదల కానుంది.

ఇకపోతే ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌ ల విషయానికి వస్తే.ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్ అయ్యే వాటి విషయానికి వస్తే.

హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌ అనే వెబ్‌సిరీస్‌ అక్టోబరు 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ది ట్రైబ్‌( The Tribe ) అనే వెబ్‌సిరీస్‌ అక్టోబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అలాగే టిమ్‌ డిల్లాన్‌ అనే హాలీవుడ్ మూవీ అక్టోబరు 01నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

"""/" / షెఫ్స్‌ టేబుల్‌ అనే వెబ్ సిరీస్ కూడా వెబ్‌సిరీస్ అక్టోబరు 02 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ అనే వెబ్‌సిరీస్‌ అక్టోబరు 02 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ 5 అనే వెబ్‌సిరీస్‌ అక్టోబరు 02 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

అలాగే ది సిగ్నేచర్‌ అనే హిందీ మూవీ అక్టోబరు 04 నుంచి జి5 లో స్ట్రీమింగ్ కానుంది.

జియో సినిమా అమర్‌ ప్రేమ్‌కీ ప్రేమ్‌ కహానీ అనే హిందీ సినిమా అక్టోబరు 04 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అయితే మొత్తంగా చూసుకుంటే థియేటర్లలో విడుదల అయ్యే సినిమాల పైన ఎక్కువగా అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ముఖ్యంగా శ్రీ విష్ణు నటించిన శ్వాగ్ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్… నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్!