చరణ్ కు డాక్టరేట్ విషయంలో ఉపాసన రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రామ్ చరణ్.( Ram Charan ) ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో రాంచరణ్ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కు లక్ బాగా కలిసొచ్చింది.ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారడం, తర్వాత చరణ్ తండ్రి కావడం, ఆ తర్వాత చరణ్ ఆస్కార్ కు( Oscar ) ఎంపిక అవ్వడం ఇలా ఒక దాని తర్వాత ఒకటి చరణ్ కు మంచి మంచి శకునాలు కనిపిస్తుండడంతో చెర్రీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రాంచరణ్ అభిమానులు మరొకసారి పండుగ చేసుకుంటున్నారు. """/" / అది ఎందుకన్నది మనందరికీ తెలిసిందే.

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు గౌర‌వ డాక్టరేట్స్ వచ్చిన విషయం తెలిసిందే.చెన్నైకు చెందిన ప్రముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ( Vels University ) ఆయ‌న‌కు గౌర‌వ డాక్టరేట్‌ను అందించింది.

వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్టరేట్స్( Doctorate ) ఇవ్వటంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్రసిద్ధి చెందింది.

ఈ ఏడాదికి గానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుక‌ల్లో ఆయ‌న‌కు గౌర‌వ డాక్టరేట్‌ను అందించింది.

దీంతో మెగా ఫ్యాన్స్ పండుగా చెసుకుంటున్నారు. """/" / మెగా అభిమానులు, టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు నటీనటులు ప్రతి ఒక్కరూ రాంచరణ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో చెర్రీ పేర మారుమోగుతోంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ భార్య ఉపాసన ( Upasana ) సైతం దీనిపై స్పందిస్తూ.

డా.రామ్ చరణ్ కొణిదెల.

మీకు ఈ గౌరవం దక్కడం చాలా గర్వంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఒకపోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతుంది.క్లింకార వచ్చిన వేళవిశేషం అంటూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

అలాగే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా కొడుకు గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.

అలా ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్1, ఆదివారం 2024