రామ్ చరణ్ స్టైలిష్ లుక్ పై ఉపాసన క్యూట్ కామెంట్.. ఫోటో వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈయన RRR సినిమా ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే ఆయన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో RC 15అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఈయన షూటింగ్ కోసం సిద్ధమవుతూ ఎంతో స్టైలిష్ లుక్ లో తయారైనట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తాను తయారవుతున్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వర్క్ మూడ్ అని ట్యాగ్ చేస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక రామ్ చరణ్ షేర్ చేసిన ఈ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

"""/"/ ఇకపోతే ఈ ఫోటోపై రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన స్పందించి క్యూట్ కామెంట్ చేశారు.

ఇక ఈ ఫోటో పై ఉపాసన కామెంట్ చేస్తూ.ఓ బేబీ అంటూ హార్ట్ సింబల్‌ పెడుతూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోలు రామ్ చరణ్ హెయిర్ స్టైల్ ఆయన బియర్డ్ లుక్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

అయితే ఈయన ఇలాంటి స్టైలిష్ లుక్ లో ఏ సినిమా కోసం కనిపించబోతున్నారు అనే విషయంపై అభిమానులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా హీరో ఎవరో తెలుసా..?