అంబానీ పెళ్లి వేడుకలలో అమ్మ చీర కట్టిన ఉపాసన..నిజంగా గ్రేట్ అంటూ?

ఇటీవల ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ( Anant Ambani ) రాధిక మర్చంట్( Radhika Marchant ) వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.

ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలో పాల్గొని సందడి చేశారు.

అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఉపాసన( Upasana ) ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తెలుగింటి సాంప్రదాయం ఉట్టిపడేలా చీరకట్టులో ఎంతో అందంగా కనిపించారు.

"""/" / ఇలా ఉపాసన చీరలో( Upasana Saree ) ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఉపాసన కట్టిన ఈ చీర వెనక చాలా పెద్ద స్టోరీ ఉందని తెలుస్తోంది.

ఉపాసన కట్టిన ఈ చీర తన అమ్మది కావటం విశేషం.ఇలా తన అమ్మచీరను ఈమె అంబానీ పెళ్లి వేడుకలలో కట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఇక ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. """/" / నిజానికి ఉపాసన ఎక్కువగా షాపింగ్ కోసం ఖర్చు చేయరు ఆమె ఇలా తన అమ్మ, అమ్మమ్మ చీరలను తిరిగి రీ డిజైన్ చేయిస్తూ వాటిని ధరిస్తుంటారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా చేత తన అమ్మమ్మ చీరకు మరింత మెరుగులు దిద్దించి ఈమె చాలా స్టైలిష్ గా తయారు చేయించుకొని ఈ పెళ్లి వేడుకలలో ధరించారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఉపాసన రాంచరణ్ దంపతులు రెండు రోజులపాటు ఈ పెళ్లి వేడుకలలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

వీరితోపాటు వెంకటేష్ దంపతులు, మహేష్ బాబు దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.

వివాదాలతో స్థాయిని తగ్గించుకుంటున్న సౌత్ నటులు.. మరీ ఇలాంటి పరిస్థితా?