మెగాస్టార్ చిరంజీవి తల్లి పుట్టినరోజు.. వైరల్ అవుతున్న ఉపాసన స్పెషల్ పోస్ట్!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవికి( Megastar Chiranjeevi ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
చిరంజీవి ఈ ఏడాది విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుండగా మే నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
నేడు చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు( Anjanadevi Birthday ) కాగా ఉపాసన( Upasana ) సోషల్ మీడియా వేదికగా పెట్టిన స్పెషల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అంజనాదేవితో కలిసి దిగిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఎంతగానో ప్రేమించే క్రమశిక్షణ కలిగిన నాన్నమ్మకు హ్యాపీ బర్త్ డే అని ఉపాసన పేర్కొన్నారు.
అంజనాదేవితో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉందని ఉపాసన చెప్పుకొచ్చారు.యోగా క్లాస్ పూర్తైన తర్వాత మా ముఖాల్లో మెరుపు చూడాలని ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదని ఉపాసన అన్నారు.
నిజంగా స్పూర్తిగా తీసుకోవాల్సిన విషయం ఇది అని ఉపాసన వెల్లడించడం గమనర్హం. """/" /
చిరంజీవి తల్లి( Chiranjeevi Mother ) అంజనా దేవి వయస్సు ప్రస్తుతం 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.
ముగ్గురు కొడుకుల సక్సెస్ లో అంజనా దేవి కీలక పాత్ర పోషించారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
అంజనా దేవికి నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తమ కుటుంబానికి బలం, ధైర్యం అంజనా దేవి అంటూ ఉపాసన పేర్కొన్నారు.
"""/" /
కుటుంబ విలువలు, ఓర్పు , సహనం, క్రమశిక్షణ లాంటి విషయాలను ఆమె నుంచి నేర్చుకోవాలని ఉపాసన పేర్కొన్నారు.
మెగా హీరోలంతా ప్రస్తుతం వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా ఈ హీరోల కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
మరోవైపు మెగా హీరోల భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.