ప్రసవం మ్యారేజ్ కంటే పెద్ద పండగలా జరగాలి.. ఉపాసన షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మెగా కోడలు ఉపాసనకు( Upasana ) సోషల్ మీడియాలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్ చరణ్( Ram Charan ) భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఉపాసన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ప్రసవం మ్యారేజ్ కంటే పెద్ద పండగలా జరగాలి అంటూ ఉపాసన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మన దేశ యువతులకు ప్రసవ సమయంలో ఎలాంటి వాతావరణం ఉండాలి అనే ప్రశ్నకు ఉపాసన తనదైన శైలిలో కామెంట్లు చేశారు.
"""/" /
తన ప్రసవ అనుభవం గురించి మాట్లాడిన ఉపాసన కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను ఆస్పత్రిలో ఉన్న సమయంలో విలాసవంతమైన వాతావరణంలో నా డెలివరీ( Delivery ) జరగాలని ఫీలయ్యానని ఆమె తెలిపారు.
నాకు మాత్రమే అలాంటి ఫీలింగ్ ఎందుకు ఉండాలి అని అనిపించిందని ఉపాసన పేర్కొన్నారు.
ప్రజలు ప్రసవంను రొటీన్ గా భావిస్తారు కానీ మహిళలు గర్భం దాల్చడానికి ఏం చేస్తారో మీకు తెలియదని ఉపాసన తెలిపారు.
"""/" /
ప్రసవం జరిగిన తర్వాత పెళ్లి కంటే ఘనంగా ఒక బిడ్డను కనడం సంబరంలా ఉండాలని ఫీలయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
గతేడాది జూన్ నెల 20వ తెదీన ఉపాసన తల్లైన సంగతి తెలిసిందే.పెళ్లైన 11 సంవత్సరాల తర్వాత ఉపాసన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
క్లీంకార( Klin Kaara ) పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి ఎన్నో అరుదైన ఘనతలు దక్కుతుండటం గమనార్హం.
2012 సంవత్సరంలో చరణ్ ఉపాసనల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాతో బిజీగా ఉండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చరణ్ ఉపాసన కెరీర్ పరంగా ఒకింత టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ కు జాతీయ అవార్డ్.. శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!