చరణ్ తో గొడవలపై నోరు విప్పిన ఉపాసన.. ఏం చెప్పారంటే..?

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో చరణ్ ఉపాసన జంట ఒకటనే సంగతి తెలిసిందే.

2012 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన చరణ్ ఉపాసనల వివాహం జరిగింది.

ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట రియల్ లైఫ్ లో గొడవ పడతారంటే ఎవరూ నమ్మరు.

వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఉపాసన రామ్ చరణ్ తో గొడవల గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అందరిలా తమ మధ్య కూడా గొడవలు, వాదనలు చిన్నచిన్న విషయాల్లో జరుగుతాయని ఉపాసన అన్నారు.

అప్పుడప్పుడూ చరణ్ కు, తనకు గొడవలు జరుగుతాయని గొడవలకు సంబంధించి ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు తమ మధ్య ఉన్నాయని ఉపాసన చెప్పుకొచ్చారు.

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు ఉంటే మాత్రమే బంధం బలపడుతుందని ఆమె తెలిపారు.

అయితే ఎటువంటి గొడవలు వచ్చినా ఇద్దరం మాట్లాడుకుని ఆ గొడవలను పరిష్కరించుకుంటామని ఉపాసన వెల్లడించారు.

చరణ్ తనకు ఎంతో ఖరీదైన బహుమతులను ఇచ్చారని తెలిపారు.తనకు చరణ్ ఇచ్చిన అత్యంత మధురమైన జ్ఞాపకాలే ఖరీదైన బహుమతులని ఉపాసన అన్నారు.

"""/"/ మరోవైపు రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కూడా రామ్ చరణ్ నటిస్తున్నట్టు వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారక ప్రకటన వెలడాల్సి ఉంది.

చాలామంది హీరోలకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన శంకర్ చరణ్ కు ఎలాంటి హిట్ ఇస్తారో చూడాల్సి ఉంది.

చరణ్ శంకర్ సినిమా కథకు సంబంధించి చాలా కథలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం శంకర్, చరణ్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి: మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి…