Upasana : ఉపాసన, చరణ్ అక్కడికి షిఫ్ట్ అవుతున్నారా.. భార్యపై ప్రేమతో అలా చేస్తున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఆయన సతీమణి ఉపాసన ( Upasana )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
రామ్ చరణ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకోగా ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ జంట పెళ్లయిన దాదాపు 10 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే.
త్వరలోనే మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు.కాగా ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన తర్వాత తరచూ ఏదో ఒక విషయంతో ఈ జంట పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
"""/" /
ముఖ్యంగా ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించగా అందులో కొన్ని అవాస్తవాలే అని ఆమె కొట్టి పడేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన రాంచరణ్ వారి పదకొండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారు.
కానీ, మేము దానికి పూర్తి భిన్నం.ప్రస్తుతం చరణ్ నేను అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాము.
"""/" /
బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామలు చిరంజీవి-సురేఖ ( Chiranjeevi-Surekha )తోనే ఉండాలని నిర్ణయించుకున్నాము.
ఎందుకంటే, మా ఎదుగుదలలో గ్రాండ్ పేరంట్స్ కీలకపాత్ర పోషించారు.వాళ్ల నుంచి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం.
గ్రాండ్ పేరంట్స్‌తో ఉంటే వచ్చే ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు అని తెలిపింది ఉపాసన.
అలాగే ప్రెగ్నెన్సీ గురించి చరణ్‌కు చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అన్న విషయం పై స్పందిస్తూ ప్రెగ్నెంట్ అయ్యానేమోనని సందేహంగా ఉందంటూ మొదటిసారి చరణ్‌కు చెప్పాను.
కన్ఫార్మ్ అయిన తర్వాత ఆయన ఎంతో సంతోషించారు.తన స్టైల్‌లో సెలబ్రేట్ చేశారు అని ఆమె తెలిపింది ఉపాసన.
హమాస్ చెరలో 19 ఏళ్ల సైనికురాలు.. ఆమె మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది!