ఇంతకన్నా ఏమీ అడగను.. వరలక్ష్మి వ్రత వేడుకలలో క్లిన్ కారాతో ఉపాసన!

ఉపాసన(Upasana ) రామ్ చరణ్(Ramcharan) వివాహం తర్వాత 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారిన సంగతి తెలిసిందే.

జూన్ 20వ తేదీ ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా మెగా కుటుంబంలోకి మూడో తరం వారసురాలు రావడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ చిన్నారికి క్లిన్ కారా(Klin Kara)అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తన కూతురు జన్మించి దాదాపు రెండు నెలలు దాటిపోయిన ఇప్పటివరకు ఉపాసన తన కుమార్తె ఫోటోని రివిల్ చేయలేదు.

"""/" / ఆగస్టు 15వ తేదీ తన అమ్మమ్మతో కలిసి క్లిన్ కారా జెండా ఎగరవేసిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఇక్కడ కూడా తన కూతురి ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడింది.

ఇకపోతే శ్రావణ శుక్రవారం సందర్భంగా ఉపాసన వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham)నిర్వహించారని తెలుస్తోంది దీంతో తన కుమార్తెతో కలిసి ఈ పూజలో పాల్గొన్నటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోని అభిమానులతో పంచుకున్నారు.

ఇలా కూతురు జన్మించాక మొదటి వరలక్ష్మి వ్రతం కావడంతో తన కుమార్తెతో కలిసి ఉపాసన ఈ వేడుకను జరుపుకున్నారు.

"""/" / రెడ్ కలర్ చుడీదార్ లో ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్నటువంటి ఉపాసన తన కూతురితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.

అయితే ఇక్కడ కూడా తన కూతురి ఫేస్ కనపడకుండా జాగ్రత్తపడ్డారు.ఇలా కూతురితో కలిసి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేస్తున్నటువంటి ఉపాసన ఇంతకుమించి ఏమీ అడగను మొదటిసారి తన కూతురితో కలిసి వ్రతం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నాగ చైతన్య పై వెంకీ మామ సంచలన వ్యాఖ్యలు… తెలియని ఆనందం అంటూ?