ఇంతవరకూ చేయలేదా.. ఆశ్చర్యంగా ఉందే.. వైరల్ అవుతున్న ఉపాసన షాకింగ్ పోస్ట్!
TeluguStop.com
హీరో రామ్ చరణ్( Ram Charan ) భార్య మెగా కోడలు ఉపాసన ( Upasana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
అపోలో హాస్పిటల్స్ యజమానిగా ఈమె మనందరికీ సుపరిచితమే.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉపాసనకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
ఉపాసన ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరొకవైపు బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఉపాసన ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి అన్న విషయం తెలిసిందే.
"""/" /
దాదాపు పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతోంది.
దీంతో మెగా అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.మెగా వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఉపాసన ప్రెగ్నెంట్( Upasana Pregnant ) అయిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.
తరచూ ఉపాసనకు సంబంధించిన ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.
ఉపాసన ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
"""/" /
ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
తన ప్రెగ్నెన్సీలో ట‍్రైమిస్టర్ సంబంధించిన పిక్స్ ని షేర్ చేసింది.అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా క్యాప్షన్ కూడా జోడించింది.
నా ఫోన్‌లో ఉన్న ఇంత మంచి ఫోటోలను ఇంతకు ముందు ఎందుకు పోస్ట్ చేయలేదా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ పోస్ట్‌కు మహేశ్ బాబు సతీమణి కామెంట్ రిప్లై కూడా ఇచ్చింది.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
‘పుష్ప-2’ రీలోడెడ్ వెర్షన్ రెడీ.. నేటి నుంచి థియేటర్లలో మరో ఆఫర్