అరేయ్ బాబు నేను అలా చెప్పలేదు.. పిల్లల టాపిక్ పై మళ్లీ క్లారిటీ ఇచ్చిన ఉపాసన!

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఈమధ్య బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఈమె మెగా ఇంటి కోడలిగా కంటే తన సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది.

ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.ఇక ఉపాసన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ప్రజలకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది.అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా తన వంతు సహాయంతో ముందుకు వచ్చింది.

ఇక రామ్ చరణ్, ఉపాసన ఓ మీటింగ్ లో తొలిసారిగా పరిచయం పెంచుకోగా.

అలా వారి మధ్య ప్రేమ మొదలయిందని.ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారని గతంలో తెలిపారు.

ఇక తమ పెళ్ళి జరిగి 10 ఏళ్లు అవగా ఇప్పటికీ తమకు పిల్లలు పుట్టే లేరన్న సంగతి అందరికీ తెలిసిందే.

పైగా తమకు పిల్లల గురించి అభిమానుల నుండి మీడియా నుండి కూడా తెగ ప్రశ్నలు ఎదురవగా వాటి గురించి ఎన్నోసార్లు స్పందించారు.

కొన్నిసార్లు ఆ ప్రశ్నలను అక్కడే ఖండించారు.అయినా ఇప్పటికీ ఈ మెగా కోడలికి పిల్లల గురించి ప్రశ్న మాత్రం తప్పడం లేదు.

"""/"/ టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ మెగా కోడలికి మాత్రం మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయి.

మామకు తగ్గ కోడలు అని చాలా మంది చాలా సార్లు ప్రశంసలు కురిపించారు.

పైగా ఉపాసన సోషల్ సర్వీస్ లలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది.ఇక ఆమె తన పిల్లల గురించి ఎన్నిసార్లు స్పందించిన కూడా చరణ్ అభిమానులు మాత్రం ఆమెను వదలట్లేరు.

మాకు జూనియర్ రామ్ చరణ్ కావాలి అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఆమె ఆ కామెంట్లను భరించలేక కొన్ని కొన్ని సార్లు కామెంట్ సెషన్ ను మ్యూట్ లో కూడా పెట్టేస్తుంది.

"""/"/ ఇటీవలే ఈమె సద్గురును కలిసి పిల్లల గురించి చర్చ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అందులో ఆమె మాట్లాడిన మాటలు కొందరు పూర్తిగా వినకుండా లేనిపోని పుకార్లను బాగా వైరల్ గా మారుస్తున్నారు.

ఇక అందులో తను కాలుష్యాన్ని కంట్రోల్ చేయడానికి పిల్లలను కన్నడం లేరు అని రామ్ చరణ్, తాను ఒక నిర్ణయానికి వచ్చినట్లు పుకారు సృష్టించారు.

దీంతో వెంటనే ఉపాసన ఈ విషయం గురించి స్పందించింది.అరే బాబు నేను అలా చెప్పలేదు.

ఇది నిజం కాదు.కావాలంటే వీడియో మొత్తం చూడండి.

తన కాపీ చదవండి అంటూ స్పందించింది.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

దీంతో కొందరు ఆమె వీడియోను చూసినట్లు కామెంట్లు పెడుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు