బిజినెస్ మీది పెట్టుబడి మాది.. మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఉపాసన?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) సతీమణి ఉపాసన( Upasana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ఈమె మెగా కోడలిగా మాత్రమే కాకుండా తనకంటూ కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

బిజినెస్ ఉమెన్ గా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ ఎంతో చక్కదిద్దుతూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఒకవైపు తన కుటుంబానికి కావలసిన సమయాన్ని కేటాయిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ తన వృత్తిపరమైన వ్యవహారాలన్నింటిని చక్క దిద్దుతూ ఉన్నారు.

"""/" / ఇక ఉపాసన మహిళా సాధికారతను( Women Empowerment ) ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది.

అన్ని రంగాలలో కూడా మహిళలు పనిచేయాలన్నదే ఆమె సంకల్పం అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే యువతకు వ్యాపారాలు చేయాలి అంటూ ఇటీవల ఈమె పిలుపునిచ్చారు.తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్( Indian School Of Business ) కాలేజీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ ఈవెంట్‌ లో మెగా కోడలు ఉపాసన మాట్లాడుతూ.హెల్త్ కేర్ రంగంలో యువ మహిళలు బిజినెస్ చేయండని కోరారు.

"""/" / హెల్త్ కేర్( Health Care ) రంగంలో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వారికి తాను అండగా ఉంటానని తెలిపారు.

మీరు బిజినెస్ చేస్తే చాలు పెట్టుబడి నేను పెడతానని అంతేకాకుండా మీతో పార్ట్నర్ గా ఉంటానని ఈమె యువ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

ఇలా యువతకు అండగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఉపాసన వ్యక్తిగత విషయానికి వస్తే రాంచరణ్ ప్రేమించి12 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఉపాసన గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

అయితే ఇప్పటివరకు ఈ చిన్నారి ఎలా ఉంటుందనే విషయాన్ని మాత్రం ఈమె అభిమానులకు చూపించలేదు.

దీంతో లిటిల్ మెగా ప్రిన్సెస్ ని చూడటం కోసం అభిమానులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత