అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ( Hero Ram Charan )భార్య ఉపాసన ( Upasana )గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఉపాసన సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.ఉపాసన తాజా పోస్ట్ లో అవసరమైన వారికి సానుభూతి, గౌరవంతో వైద్యం అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య నేర్పించారని ఉపాసన చెప్పుకొచ్చారు.

తాతయ్య మాటల నుంచి మేము స్పూర్తి పొందామని ఉపాసన తెలిపారు.అయోధ్య రామ మందిరం దగ్గర తాజాగా ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ( Free Emergency Care Center )ను ప్రారంభించామని ఉపాసన కామెంట్లు చేశారు.

తిరుమల, శ్రీశైలం, బద్రీనాథ్, కేదార్ నాథ్ లలో సైతం విజయవంతంగా ఈ సెంటర్లు ఏర్పాటు చేశామని ఉపాసన అన్నారు.

ఇప్పుడు రామ జన్మభూమిలో దీనిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఉపాసన కామెంట్లు చేశారు.

ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని ఆమె తెలిపారు.

"""/" / ఉపాసన వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ప్రజలకు మేలు జరిగేలా ఉపాసన తీసుకుంటున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాసన రామ్ చరణ్ కు సైతం అన్ని విషయాలలో సపోర్ట్ చేస్తుండటం గమనార్హం.

ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. """/" / ఉపాసన రామ్ చరణ్ సినిమాల్లో గెస్ట్ రోల్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే సినిమాల విషయంలో ఉపాసన నిర్ణయం ఏ విదంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ 2025 సంక్రాంతి పండుగ కానుకగా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సక్సెస్ సాధించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?