మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న మెగాకోడలు.. అన్ని శుభ పరిణామాలే?

మెగా కోడలు, రామ్ చరణ్( Ram Charan ) సతీమణి ఉపాసన కొణిదెల( Upasana Konidela ) అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

ఉపాసన ఇప్పటికే తన వ్యక్తిగత జీవితంలో ఎంతో కీర్తి ప్రతిష్టలను అందుకున్నారు.అలాగే వృత్తిపరమైన జీవితంలో కూడా ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకున్నారు.

ఈమె పలు వ్యాపార రంగాలలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు.అలాగే అపోలో హాస్పిటల్( Apollo Hospital ) వ్యవహారాలన్నింటినీ కూడా ఎంతో చక్కదిద్దుతూ వస్తున్నారు.

"""/" / ఇలా మెగా ఇంటి కోడలుగా కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నటువంటి ఉపాసన మరో అద్భుతమైన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేస్తున్న వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌( World Wide Fund For Nature ) (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌)లో ఇండియా విభాగానికి ఆమె నేషనల్ అంబాసిడర్ గా నియమితులు అయ్యారు ఇదే విషయాన్ని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి అధికారికంగా ప్రకటించారు.

"""/" / డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ ఇండియా, అపోలో హాస్పిటల్‌ ట్రస్ట్‌ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగు సంవత్సరాల పాటు ఉపాసన ఈ బాధ్యతలను వ్యవహరించబోతున్నారని తెలుస్తుంది.

ఇక ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా గాయపడిన జంతువులకు చికిత్స అందించడమే కాకుండా అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది గాయపడిన అపోలో హాస్పిటల్స్ ద్వారా వారికి ఉచితంగా వైద్య సేవలను అందించబోతున్నారు.

ఈ విధంగా ఉపాసన ఈ గౌరవాన్ని అందుకోవడంతో మెగా ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా మెగా కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతున్నాయి అంటూ ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు.

ఇటీవల మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఎన్నికలలో ఘనవిజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అలాగే చిరంజీవి( Chiranjeevi ) పద్మవిభూషణ్ అవార్డు అందుకు ఒక రామ్ చరణ్ ఆస్కార్ అవార్డును అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డల్ గా అనిపిస్తే మాత్రం ఆ పని చేస్తాను.. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్ వైరల్!