నా కోసం రామ్ చరణ్ అంట్లు కూడా తోమాడంటున్న ఉపాసన…
TeluguStop.com
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ఎంత అన్యోన్యంగా ఉంటారో పెద్దగా చెప్పనవసరం లేదు.
ఒక పక్క రామ్ చరణ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ నిర్మిస్తూ బిజీబిజీగా ఉన్నప్పటికీ రోజులో ఉపాసన కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.
అలాగే ఉపాసన కూడా ఒక పక్క వ్యాపార పనులు, మరోపక్క కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తోంది.
అందువల్ల వీరిద్దరూ టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా చెప్పుకుంటారు.అయితే ఉపాసన కొణిదెల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజానికి ఉపయోగపడే సలహాలు, సూచనలు అందిస్తోంది.
అప్పుడప్పుడు తన కుటుంబ సభ్యులకు బంధించిన విషయాలను కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తాజాగా ఉపాసన కొణిదెల తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ట్వీట్ నెట్ లో తెగ వైరల్ అవుతుంది.
ఇందులో రామ్ చరణ్ తేజ్ తన భార్యకు రుచికరమైన వంట వండి పెట్టడమే కాకుండా వంట వండడానికి ఉపయోగించినటువంటి పాత్రలను కూడా శుభ్రం చేశాడని, రామ్ చరణ్ నా రియల్ హీరో అంటూ పేర్కొంది.
దీంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.అంతేగాక ఇలాగే మీరిద్దరూ జీవితాంతం హ్యాపీగా ఉండాలంటూ రామ్ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
"""/"/
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆర్ఆర్ఆర్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి దాదాపు 60 శాతం చిత్రీకరణ పూర్తయింది.దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 8వ తారీకున విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఫౌజీ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ? అది ఏ ఇయర్ లో జరుగుతుంది..?