దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్… ఎంతో ప్రత్యేకం అంటూ!
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన సతీమణి ఉపాసన(Upasana) ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు(Bucchi Babu)కు స్పెషల్ గిఫ్ట్ పంపించారు.
ఇటీవల రామ్ చరణ్ 40 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.
ఇలా ఈ పుట్టినరోజు వేడుకలను అతి కొద్ది మంది సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈమె పలువురు సెలబ్రిటీలకు కానుకలను అందజేశారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది (Peddi)సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు కోసం కూడా ఈ దంపతులు ఒక కానుకను పంపించారు.
"""/" /
ఇలా చరణ్ ఉపాసన పంపిన ఆ కానుకులకు సంబంధించిన ఫోటోలను బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను గిఫ్ట్‌గా పంపారు.
నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని రాసి ఉన్న నోట్, శ్రీరాముని పాదుకలను కూడా పంపించారు.
"""/" /
ఈ విధంగా ఉపాసన తన కోసం ఈ విధమైనటువంటి కానుకలను పంపించడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.
ఈ బహుమతి మీ ప్రేమను తెలియజేస్తోంది.ఇది నాకెంతో ప్రత్యేకం అంటూ ఉపాసన రామ్ చరణ్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల కాబోతుంది.
ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.